ఐపీఎల్‌ వినోదం ముందే..

ఈసారి ఐపీఎల్‌ వినోదం కాస్త ముందే మొదలవబోతోంది.  మార్చి 22న 17వ సీజన్‌ శ్రీకారం చుట్టుకోనుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది. ఈ పోరుకు చెన్నై వేదిక. లోకసభ ఎన్నికల షెడ్యూల్‌ త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో తొలి   21 మ్యాచ్‌లకే బీసీసీఐ గురువారం షెడ్యూల్‌ వెల్లడించింది.

Published : 23 Feb 2024 03:18 IST

మార్చి 22 నుంచే 17వ సీజన్‌
ఆర్సీబీతో చెన్నై తొలిపోరు

ముంబయి

సారి ఐపీఎల్‌ వినోదం కాస్త ముందే మొదలవబోతోంది.  మార్చి 22న 17వ సీజన్‌ శ్రీకారం చుట్టుకోనుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది. ఈ పోరుకు చెన్నై వేదిక. లోకసభ ఎన్నికల షెడ్యూల్‌ త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో తొలి 21 మ్యాచ్‌లకే బీసీసీఐ గురువారం షెడ్యూల్‌ వెల్లడించింది. ఈ లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌ల తేదీలను ఎన్నికల నోటిఫికేషన్‌ అనంతరం వెలువరించే అవకాశం ఉంది. విశాఖపట్నం వేదికగా దిల్లీ క్యాపిటల్స్‌ తొలి రెండు మ్యాచ్‌లను ఆడనుంది. మార్చి 31న చెన్నైతో.. ఏప్రిల్‌ 3న కోల్‌కతాతో దిల్లీ తలపడనుంది. మార్చి 27న ముంబయితో, ఏప్రిల్‌ 5న చెన్నైతో హైదరాబాద్‌ వేదికగా సన్‌రైజర్స్‌ మ్యాచ్‌లు జరుగుతాయి.

ఐపీఎల్‌కు షమి దూరం!: వన్డే ప్రపంచకప్‌ తర్వాత గాయం కారణంగా మళ్లీ మైదానంలోకి దిగని భారత స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమి.. మార్చి 22న ఆరంభమయ్యే ఐపీఎల్‌కు కూడా దూరం కానున్నాడు. చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకోవడానికి అతడీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో ప్రపంచకప్‌ ఫైనల్‌ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటన, స్వదేశంలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌లలో ఈ పేసర్‌ ఆడలేదు. ‘‘చీలమండ గాయానికి ఈ జనవరిలో లండన్‌లో చికిత్స తీసుకుంటున్న సమయంలో షమికి వైద్యులు కొన్ని ఇంజెక్షన్లు చేశారు. మూడు వారాల తర్వాత మళ్లీ శిక్షణ మొదలుపెట్టొచ్చని అతడు అనుకున్నాడు. అయితే ఇంజెక్షన్లు సత్ఫలితాన్ని ఇవ్వకపోవడంతో శస్త్ర చికిత్స అనివార్యమవుతోంది. యూకేలోనే షమి ఈ చికిత్స చేయించుకోనున్నాడు. అందుకే ఐపీఎల్‌ ఆడే అవకాశాల్లేవు’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని