ఎఫ్‌ఐహెచ్‌ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్‌

అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్‌ఐహెచ్‌ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్‌ గోల్‌కీపర్‌ శ్రీజేష్‌ నియమితుడయ్యాడు.

Published : 28 Mar 2024 02:41 IST

లాసానె: అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్‌ఐహెచ్‌ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్‌ గోల్‌కీపర్‌ శ్రీజేష్‌ నియమితుడయ్యాడు. మరోవైపు చిలీ మహిళల హాకీ జట్టు క్రీడాకారిణి కమిలా కూడా సహ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనుంది. ‘‘అథ్లెట్లే ముందు’’ అనే విధానం కోసం ఈ ఇద్దరూ పని చేయనున్నారు. ఎఫ్‌ఐహెచ్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు, ఎఫ్‌ఐహెచ్‌ కమిటీ, సలహా ప్యానెల్‌ తదితర వాటికి ఈ అథ్లెట్ల కమిటీ సలహాలిస్తుంది. అథ్లెట్ల ఆరోగ్యం, సంక్షేమం, డోపింగ్‌ను అరికట్టడం, కొత్త అభిమానులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు అథ్లెట్ల తరపున తగిన సూచనలను ఈ కమిటీ అందిస్తుంది. ‘‘అథ్లెట్ల కమిటీలో భాగమవడం నాకు దక్కిన గొప్ప గౌరవం. సహ అధ్యక్షుడిగా ఉండటం ఓ బాధ్యత. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హాకీ ప్లేయర్ల ఉన్నతి కోసం కమిలా, ఇతర కమిటీ సభ్యులతో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నా’’ అని శ్రీజేష్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని