నీరజ్‌.. దోహా టోర్నీతో షూరూ

ఒలింపిక్‌ ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా ఈ సీజన్‌ను మే 10న ఆరంభమయ్యే డైమండ్‌ లీగ్‌ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు.

Published : 29 Mar 2024 02:42 IST

దిల్లీ: ఒలింపిక్‌ ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా ఈ సీజన్‌ను మే 10న ఆరంభమయ్యే డైమండ్‌ లీగ్‌ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. ఆసియా క్రీడల్లో పసిడి గెలిచి గత సీజన్‌ను ఘనంగా ముగించిన 26 ఏళ్ల నీరజ్‌.. ఈ ఏడాది తొలి టోర్నీలోనూ శుభారంభం చేయాలని భావిస్తున్నాడు. ‘‘ఈ ఏడాది నా లక్ష్యం ఒలింపిక్‌ స్వర్ణాన్ని నిలబెట్టుకోవడం. 90 మీటర్లు దాటడం ఇంకో లక్ష్యం. ఈ సీజన్‌ను మెరుగ్గా ఆరంభించడానికి దోహాకు మించిన వేదిక దొరకబోదు’’ అని నీరజ్‌ చెప్పాడు. ఒలింపిక్‌ రజత పతక విజేత జాకబ్‌ వాద్లెచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌), మాజీ ప్రపంచ ఛాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా) నుంచి నీరజ్‌కు గట్టిపోటీ ఎదురుకానుంది. మరోవైపు 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అయిదో స్థానంలో నిలిచి.. ఆసియా క్రీడల్లో రజతం గెలిచిన మరో భారత ఆటగాడు కిశోర్‌ జెనా కూడా దోహా ఈవెంట్లో బరిలో దిగుతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని