Rishabh Pant: పంత్‌.. ఒకప్పటిలా

2022 చివర్లో రోడ్డు ప్రమాదం నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు రిషబ్‌ పంత్‌. తీవ్ర గాయాల పాలయ్యాడు. శస్త్రచికిత్సలు జరిగాయి. మళ్లీ మైదానంలో పంత్‌ను చూడగలమా?

Updated : 01 Apr 2024 07:51 IST

2022 చివర్లో రోడ్డు ప్రమాదం నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు రిషబ్‌ పంత్‌. తీవ్ర గాయాల పాలయ్యాడు. శస్త్రచికిత్సలు జరిగాయి. మళ్లీ మైదానంలో పంత్‌ను చూడగలమా? మునుపటిలా ఆడగలడా? అనే ప్రశ్నలు వినిపించాయి. కానీ సంకల్ప బలంతో అతను నిలబడ్డాడు. గాయాలను దాటి ఆటలోకి తిరిగొచ్చాడు. ఈ ఐపీఎల్‌తోనే పోటీ క్రికెట్లో పునరాగమనం చేశాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 18, 28 పరుగులు చేశాడు. ఇప్పుడు చెన్నైతో మ్యాచ్‌లో ఒకప్పటిలా చెలరేగాడు. తన శైలిలో ఒంటి చేతి సిక్సరూ కొట్టాడు. జడేజా బౌలింగ్‌లో మోకాలు కిందికి ఆనించి బాదిన షాట్‌ చూసి తీరాల్సిందే. యార్కర్లతో ప్రమాదకరంగా మారిన పతిరన బౌలింగ్‌లోనూ పంత్‌ భారీ షాట్లు ఆడాడు. అర్ధశతకంతో జట్టు ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించాడు. అతనిలా తిరిగి పరుగుల వేటలో సాగడం దిల్లీకే కాదు టీమ్‌ఇండియాకూ సంతోషాన్ని కలిగించే విషయమే. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో పంత్‌ ఇదే జోరు కొనసాగిస్తే జాతీయ జట్టులోకి తిరిగి రావడం ఖాయమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని