ఐపీఎల్‌ వేలం ఖర్చు పెంపు?

ఐపీఎల్‌ ఫ్రాంచైజీల యజమానులతో బీసీసీఐ అనధికారిక సమావేశం నిర్వహించనుంది. ఈనెల 16న అహ్మదాబాద్‌లో జరిగే భేటీలో మెగా వేలంలో ఫ్రాంచైజీలు ఖర్చు చేసే మొత్తం పెంపుదల..

Published : 02 Apr 2024 02:23 IST

16న ఫ్రాంచైజీలతో బీసీసీఐ భేటీ

దిల్లీ: ఐపీఎల్‌ ఫ్రాంచైజీల యజమానులతో బీసీసీఐ అనధికారిక సమావేశం నిర్వహించనుంది. ఈనెల 16న అహ్మదాబాద్‌లో జరిగే భేటీలో మెగా వేలంలో ఫ్రాంచైజీలు ఖర్చు చేసే మొత్తం పెంపుదల.. ఆటగాళ్లను అట్టిపెట్టుకునే విధానం గురించి బోర్డు చర్చించనుంది. ‘‘ఐపీఎల్‌ ఫ్రాంచైజీల యజమానుల్ని అనధికారిక సమావేశానికి ఆహ్వానించారు. నిర్దిష్టమైన అజెండా ఏమీ లేదు. ఈ సీజన్‌ రెండో నెలలో అడుగుపెట్టిన నేపథ్యంలో భాగస్వాముల్ని కలిసేందుకు మంచి సమయం’’ అని బీసీసీఐ అధికారి తెలిపాడు. అయితే ఈ ఏడాది చివర్లో జరిగే ఆటగాళ్ల మెగా వేలం గురించే భేటీలో ప్రధానంగా చర్చ జరగనుంది. ఇప్పటి వరకు ఆటగాళ్ల కొనుగోలు కోసం ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఈ పరిమితిని పెంచే అవకాశముంది. ప్రస్తుతం ఒక్కో ఫ్రాంచైజీ నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే విధానం అమల్లో ఉంది. దీనిపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. ప్రతి మూడేళ్లకోసారి మెగా వేలం జరుగుతుంది. గతంలో 2022లో ఈ వేలం నిర్వహించారు. 2025 సీజన్‌కు ముందు మరోసారి జరుగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని