ఆంధ్ర జోనల్‌ క్రికెటర్ల పౌష్ఠికాహారానికి రూ.1.5 కోట్లు

జోనల్‌ స్థాయి క్రికెటర్లకు అవసరమైన పౌష్ఠికాహారం కోసం ఆంధ్ర క్రికెట్‌ సంఘం(ఏసీఏ) రూ.1.5కోట్ల ఆర్థిక సాయం అందజేసింది. విశాఖ స్టేడియంలో మంగళవారం బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ, దిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ పాంటింగ్‌, ఏసీఏ కార్యదర్శి గోపీనాథరెడ్డి సంబంధిత చెక్కును క్రీడాకారులకు అందజేశారు.

Published : 03 Apr 2024 02:47 IST

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: జోనల్‌ స్థాయి క్రికెటర్లకు అవసరమైన పౌష్ఠికాహారం కోసం ఆంధ్ర క్రికెట్‌ సంఘం(ఏసీఏ) రూ.1.5కోట్ల ఆర్థిక సాయం అందజేసింది. విశాఖ స్టేడియంలో మంగళవారం బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ, దిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ పాంటింగ్‌, ఏసీఏ కార్యదర్శి గోపీనాథరెడ్డి సంబంధిత చెక్కును క్రీడాకారులకు అందజేశారు. ఏసీఏ కార్యదర్శి మాట్లాడుతూ 2023-24 ఏడాదిలో జోనల్‌ స్థాయిలో ఆడిన 400 మందికి నెలకు రూ.3 వేల చొప్పున అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఏసీఏ సంయుక్త కార్యదర్శి రాకేష్‌, సీఈఓ ఎం.వి.శివరారెడ్డి, జీఎంలు ఎం.ఎస్‌.కుమార్‌, ఎస్‌.ఎం.ఎన్‌.రోహిత్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని