ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌ల తేదీలు మార్పు

అనుకున్నట్లే కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ తేదీని బీసీసీఐ మార్చింది. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 17న ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగాల్సిన మ్యాచ్‌ను ఒకరోజు ముందుకు జరిపింది.

Published : 03 Apr 2024 02:53 IST

దిల్లీ: అనుకున్నట్లే కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ తేదీని బీసీసీఐ మార్చింది. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 17న ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగాల్సిన మ్యాచ్‌ను ఒకరోజు ముందుకు జరిపింది. శ్రీరామ నవమి కారణంగా తగినంత భద్రత కల్పించలేమని పోలీసులు తెలపడంతో మ్యాచ్‌ను 16వ తేదీకి మార్చింది. ఆ రోజు అహ్మదాబాద్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను 17న నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని