SuryaKumar Yadav: సూర్య వచ్చేస్తున్నాడు!

ఐపీఎల్‌-17లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి డీలా పడ్డ ముంబయి ఇండియన్స్‌కు ఊరటనిచ్చే వార్త. శస్త్రచికిత్సల నుంచి కోలుకుంటున్న ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌, ప్రపంచ నంబర్‌వన్‌ టీ20 ఆటగాడు సూర్యకుమార్‌ త్వరలోనే ముంబయితో చేరే అవకాశముంది.

Updated : 04 Apr 2024 09:22 IST

దిల్లీ: ఐపీఎల్‌-17లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి డీలా పడ్డ ముంబయి ఇండియన్స్‌కు ఊరటనిచ్చే వార్త. శస్త్రచికిత్సల నుంచి కోలుకుంటున్న ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌, ప్రపంచ నంబర్‌వన్‌ టీ20 ఆటగాడు సూర్యకుమార్‌ త్వరలోనే ముంబయితో చేరే అవకాశముంది. జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఉన్న అతను అక్కడ ఒకటి మినహా అన్ని ఫిట్‌నెస్‌ పరీక్షలను పూర్తి చేసినట్లు తెలిసింది. మిగిలిన ఆ ఒక్క పరీక్షను గురువారం నిర్వహించనున్నారు. ఇందులోనూ అతను ఫిట్‌గా తేలితే మ్యాచ్‌ ఆడేందుకు ఎన్‌సీఏ నుంచి అనుమతి వస్తుంది. దీంతో అతను ఏప్రిల్‌ 7న దిల్లీ క్యాపిటల్స్‌తో లేదా 11న ఆర్సీబీతో మ్యాచ్‌లో ఆడే అవకాశముంది. చివరగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆడిన సూర్య.. ఆ తర్వాత చీలమండలో చీలిక, స్పోర్ట్స్‌ హెర్నియా శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. ‘‘తిరిగి మ్యాచ్‌ ఆడేందుకు అవసరమైన మరో ఫిట్‌నెస్‌ పరీక్షలో సూర్య పాసవాల్సి ఉంది. గురువారం ఆ పరీక్ష తర్వాత అతని ఫిట్‌నెస్‌పై ఓ స్పష్టత వస్తుంది. అతను సౌకర్యవంతంగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు’’ అని ఓ బీసీసీఐ ప్రతినిధి తెలిపాడు. జూన్‌ 1న ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో సూర్య విషయంలో బీసీసీఐ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని