ఆకాశ్‌, అనిరుధ్‌ ఓటమి

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆకాశ్‌ దహియా, అనిరుధ్‌ కుమార్‌లకు నిరాశ ఎదురైంది. ఈ భారత కుర్రాళ్లు కాంస్య పతక పోరులో ఓడారు. 61 కేజీల్లో ఎంక్‌బోల్డ్‌ ఎంక్‌బాత్‌ (మంగోలియా) చేతిలో ఆకాశ్‌ చిత్తు కాగా.. 125 కేజీల్లో షమిల్‌ షరిపోవ్‌ (బహ్రెయిన్‌) అనిరుధ్‌ను కంగుతినిపించాడు.

Published : 13 Apr 2024 02:43 IST

బిష్కెక్‌: ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆకాశ్‌ దహియా, అనిరుధ్‌ కుమార్‌లకు నిరాశ ఎదురైంది. ఈ భారత కుర్రాళ్లు కాంస్య పతక పోరులో ఓడారు. 61 కేజీల్లో ఎంక్‌బోల్డ్‌ ఎంక్‌బాత్‌ (మంగోలియా) చేతిలో ఆకాశ్‌ చిత్తు కాగా.. 125 కేజీల్లో షమిల్‌ షరిపోవ్‌ (బహ్రెయిన్‌) అనిరుధ్‌ను కంగుతినిపించాడు. మరో భారత రెజ్లర్‌ యశ్‌ తుషీర్‌ (74 కేజీ) రెపిచేజ్‌లో పరాజయం చవిచూశాడు. సైబాజ్‌ (కజకిస్థాన్‌) అతడిపై పైచేయి సాధించాడు. సందీప్‌సింగ్‌ మాన్‌ (86 కేజీ), వినయ్‌ (92 కేజీ) క్వాలిఫికేషన్లోనే ఇంటిముఖం పట్టారు. ఈ టోర్నీలో భారత్‌ పురుషుల విభాగంలో మూడు పతకాలు నెగ్గింది. ఫ్రీస్టైల్‌ ఈవెంట్లో ఉదిత్‌ (57 కేజీ) రజతం గెలవగా.. విక్కీ (97 కేజీ), అభిమన్యు (70 కేజీ) కాంస్యాలు సొంతం చేసుకున్నారు. శనివారం మహిళల బౌట్లు ప్రారంభం కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని