భారత్‌కు నాలుగో పరాజయం

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భారత హాకీ జట్టు వైఫల్యం కొనసాగుతోంది. అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓడింది. శుక్రవారం జరిగిన నాలుగో టెస్టులో భారత్‌ 1-3తో ఆసీస్‌ చేతిలో పరాజయం చవిచూసింది.

Published : 13 Apr 2024 02:44 IST

పెర్త్‌: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భారత హాకీ జట్టు వైఫల్యం కొనసాగుతోంది. అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓడింది. శుక్రవారం జరిగిన నాలుగో టెస్టులో భారత్‌ 1-3తో ఆసీస్‌ చేతిలో పరాజయం చవిచూసింది. మ్యాచ్‌ ఆసాంతం భారత్‌ గట్టిగా పోరాడినా ఆసీస్‌ను నిలువరించడంలో విఫలమైంది. 12వ నిమిషంలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ గోల్‌ కొట్టి భారత్‌ ఖాతా తెరిచాడు. అయితే 19, 47వ నిమిషాల్లో జెరెమీ హేవార్డ్స్‌ రెండు గోల్స్‌ సాధించి 2-1తో ఆసీస్‌కు ఆధిక్యాన్ని అందించాడు. 54వ నిమిషంలో జాక్‌ వెల్చ్‌ గోల్‌తో ఆసీస్‌ ఘనవిజయం సాధించింది. శనివారం అయిదో టెస్టు జరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని