టీ20ల్లో అహం ఉండకూడదు

టీ20 ఫార్మాట్లో బౌలర్లు అహాన్ని పక్కన పెట్టి భిన్న రకాల బంతులు వేయాల్సి ఉంటుందని ముంబయి ఇండియన్స్‌ పేసర్‌ బుమ్రా అన్నాడు. బెంగళూరుపై అద్భుత ప్రదర్శన చేసిన ఈ ముంబయి పేసర్‌ 5 వికెట్లు పడగొట్టాడు.

Published : 13 Apr 2024 02:48 IST

ముంబయి: టీ20 ఫార్మాట్లో బౌలర్లు అహాన్ని పక్కన పెట్టి భిన్న రకాల బంతులు వేయాల్సి ఉంటుందని ముంబయి ఇండియన్స్‌ పేసర్‌ బుమ్రా అన్నాడు. బెంగళూరుపై అద్భుత ప్రదర్శన చేసిన ఈ ముంబయి పేసర్‌ 5 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో బుమ్రా మాట్లాడుతూ.. ‘‘ప్రతిసారి యార్కర్‌ వేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు యార్కర్‌, బౌన్సర్‌ సంధిస్తాం. ఈ ఫార్మాట్లో అహం ఉండకూడదు. గంటకు 145 కిమీ వేగంతో బౌలింగ్‌ చేసే సామర్థ్యం ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు నెమ్మదిగా బంతులు వేయడం కూడా ముఖ్యమే. ఈ ఫార్మాట్లో బౌలర్లకు చాలా కష్టం. కాబట్టి ఒకే వ్యూహంతో ఉండకూడదని భావిస్తా. కెరీర్‌ మొదట్లోనే దీనిపై కసరత్తు చేశా’’ అని బుమ్రా చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు