హార్దిక్‌ గాయాన్ని దాస్తున్నాడు!

ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య గాయాన్ని దాస్తున్నట్లుగా న్యూజిలాండ్‌ మాజీ పేసర్‌ సైమన్‌ డౌల్‌ అనుమానం వ్యక్తం చేశాడు. గాయంతో అతను బౌలింగ్‌కు దిగట్లేదని అనిపిస్తోందని డౌల్‌ అన్నాడు.

Published : 14 Apr 2024 02:21 IST

ముంబయి: ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య గాయాన్ని దాస్తున్నట్లుగా న్యూజిలాండ్‌ మాజీ పేసర్‌ సైమన్‌ డౌల్‌ అనుమానం వ్యక్తం చేశాడు. గాయంతో అతను బౌలింగ్‌కు దిగట్లేదని అనిపిస్తోందని డౌల్‌ అన్నాడు. కొన్ని మ్యాచ్‌ల నుంచి ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేయని నేపథ్యంలో అతనిలా వ్యాఖ్యానించాడు. ‘‘ఐపీఎల్‌-17లో ముంబయి ఆడిన తొలి మ్యాచ్‌లోనే మొదటి ఓవర్‌ బౌలింగ్‌ చేశాడు హార్దిక్‌. ఆ తర్వాత అతడు బంతితో ఎక్కువగా కనిపించలేదు. కొత్త బంతితో బౌలింగ్‌ చేసిన బౌలర్‌ ఉన్నట్లుండి ఎందుకు అవసరం లేకుండా అయ్యాడు? గాయపడడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. కానీ అతడు దీన్ని ఒప్పుకోడు’’ అని డౌల్‌ చెప్పాడు. ఇప్పటిదాకా 3 మ్యాచ్‌ల్లో 8 ఓవర్లు వేసిన హార్దిక్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. బెంగళూరుతో మ్యాచ్‌లో ముంబయి ఏడుగురు బౌలర్లను ఉపయోగించడంతో హార్దిక్‌ ఒక ఓవర్‌ వేసి 13 పరుగులు ఇచ్చాడు. అంతకుముందు దిల్లీ క్యాపిటల్స్‌పై ఆరుగురు బౌలర్లనే వాడినా కూడా తాను మాత్రం బంతిని అందుకోలేదు. ఇక రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లోనూ బౌలింగ్‌ చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని