భళా పంత్‌!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్‌

రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్‌ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్‌లో అతను అదరగొడుతున్నాడు.

Updated : 18 Apr 2024 07:11 IST

రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్‌ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్‌లో అతను అదరగొడుతున్నాడు. బ్యాటర్‌గా ఇప్పటికే మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన పంత్‌.. బుధవారం కెప్టెన్‌గా, వికెట్‌ కీపర్‌గా గొప్ప నైపుణ్యం చూపించాడు. అతడి బౌలింగ్‌, ఫీల్డింగ్‌ వ్యూహాలు అద్భుతంగా పని చేశాయి. ఇక వికెట్ల వెనుక పంత్‌ పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. రెండు చక్కటి క్యాచ్‌లు అందుకోవడంతో పాటు ఒకే ఓవర్లో ఇద్దరిని మెరుపు వేగంతో స్టంపింగ్‌ చేసి ఔరా అనిపించాడు. బ్యాటింగ్‌లో 16 పరుగులు కూడా చేయడంతో.. ఆరంభంలోనే 2 వికెట్లతో టైటాన్స్‌ పతనానికి బాటలు పరిచిన ఇషాంత్‌ను కాదని పంత్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని