చమరి 195 నాటౌట్‌

మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్‌; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

Published : 19 Apr 2024 03:36 IST

లంక రికార్డు ఛేదన

పొచెఫ్‌స్ట్రూమ్‌: మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్‌; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. వన్డేల్లో ఇదే అతిపెద్ద ఛేదన. ఒక దశలో 126/4తో ఇబ్బందిపడిన లంక.. ఆటపట్టు మెరుపు ఇన్నింగ్స్‌తో అలవోకగా లక్ష్యాన్ని అందుకుంది. 44.3 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి విజయం సొంతం చేసుకుని మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో ముగించింది. నీలాక్షిక సిల్వా (50 నాటౌట్‌) రాణించింది. మొదట సఫారీ జట్టు 50 ఓవర్లలో 301/5 స్కోరు చేసింది. లారా వోల్వార్ట్‌ (184 నాటౌట్‌; 147 బంతుల్లో 23×4, 4×6) కూడా భారీ శతకం చేసింది. మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా (2012లో న్యూజిలాండ్‌పై 289 పరుగులు) పేరిట ఉన్న రికార్డును లంక తిరగరాసింది. చమరి సాధించిన 195 పరుగులు కూడా వన్డేల్లో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు. అమేలియా కెర్‌ (232 నాటౌట్‌), బెలిండా క్లార్క్‌ (229 నాటౌట్‌) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. పురుషులు, మహిళల క్రికెట్లో కలిపి ఛేదనలో చమరిది రెండో అత్యధిక స్కోరు. మ్యాక్స్‌వెల్‌ (201 నాటౌట్‌) ముందున్నాడు. దక్షిణాఫ్రికా-లంక వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వర్షంతో రద్దవగా.. రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని