దీపకు నాలుగో స్థానం

దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్‌ ప్రపంచకప్‌ను భారత స్టార్‌ దీప కర్మాకర్‌ నాలుగో స్థానంతో ముగించింది.

Published : 20 Apr 2024 02:43 IST

దిల్లీ: దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్‌ ప్రపంచకప్‌ను భారత స్టార్‌ దీప కర్మాకర్‌ నాలుగో స్థానంతో ముగించింది. పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత టోర్నీగా జరిగిన ఈ ఈవెంట్లో దీప సత్తా చాటినా కొద్దిలో పతకం కోల్పోయింది. మహిళల వాల్ట్‌ ఫైనల్లో ఆమె 13.333 స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచింది. నవాస్‌ కార్లా (13.850, పనామా), అన్‌ చాంగ్‌ (13.833, కొరియా), జార్జియెవా (13.466, బల్గేరియా) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. మే 16న ఉజ్బెకిస్థాన్‌లో ఆరంభమయ్యే ఒలింపిక్స్‌ చివరి క్వాలిఫయర్‌ ఈవెంట్‌ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో దీప పోటీపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని