MS Dhoni:: ధోని.. ఇంకా నాటౌటే

చివరి సీజన్‌గా భావిస్తున్న ఈ ఐపీఎల్‌లో బ్యాటింగ్‌ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని.

Updated : 20 Apr 2024 09:37 IST

చివరి సీజన్‌గా భావిస్తున్న ఈ ఐపీఎల్‌లో బ్యాటింగ్‌ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. చివరి ఓవర్లలో బ్యాటింగ్‌కు వస్తూ ఆడిన కొన్ని బంతుల్లోనే మెరుపు షాట్లు ఆడుతున్నాడు. గత మ్యాచ్‌లో ముంబయిపై వరుసగా మూడు సిక్సర్లు బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మహి.. శుక్రవారం లఖ్‌నవూపై 9 బంతుల్లోనే 28 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతను మూడు ఫోర్లతో పాటు రెండు కళ్లు చెదిరే సిక్సర్లు బాదాడు. విశేషమేంటంటే.. ఈ సీజన్లో ధోని అయిదు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌ చేస్తే ఒక్కసారీ ఔట్‌ కాలేదు. ప్రతిసారీ నాటౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. మొత్తంగా అతను 30 బంతులాడి 87 పరుగులు చేశాడు. స్ట్రైక్‌ రేట్‌ 290 కావడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని