డుప్లాంటిస్‌ ప్రపంచ రికార్డు

స్వీడన్‌ పోల్‌వాల్ట్‌ స్టార్‌ ఆర్మాండ్‌ డుప్లాంటిస్‌ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. శనివారం డైమండ్‌ లీగ్‌ తొలి అంచె టోర్నీలో పురుషుల పోల్‌వాల్ట్‌ ఫైనల్లో 6.24 మీటర్లు ఎగిరిన డుప్లాంటిస్‌ తన పేరిటే ఉన్న రికార్డు (6.23 మీటర్లు)ను బద్దలు కొట్టాడు.

Published : 21 Apr 2024 03:04 IST

గ్జియామెన్‌ (చైనా): స్వీడన్‌ పోల్‌వాల్ట్‌ స్టార్‌ ఆర్మాండ్‌ డుప్లాంటిస్‌ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. శనివారం డైమండ్‌ లీగ్‌ తొలి అంచె టోర్నీలో పురుషుల పోల్‌వాల్ట్‌ ఫైనల్లో 6.24 మీటర్లు ఎగిరిన డుప్లాంటిస్‌ తన పేరిటే ఉన్న రికార్డు (6.23 మీటర్లు)ను బద్దలు కొట్టాడు. రెండో స్థానంలో నిలిచిన సామ్‌ కెండ్రిక్స్‌ 5.82 మీటర్లు మాత్రమే ఎగిరాడు. ప్రపంచ రికార్డు సాధించడం డుప్లాంటిస్‌కు ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. మహిళల 200 మీటర్ల పరుగులో ఆస్ట్రేలియా టీనేజర్‌ టోరీ లూయిస్‌ (22.96 సెకన్లు) టైటిల్‌ ఎగరేసుకుపోయింది. ఫేవరెట్‌ షకారి రిచర్డ్‌సన్‌ (అమెరికా, 22.99 సెకన్లు)కి షాకిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని