పాక్‌దే రెండో టీ20

న్యూజిలాండ్‌తో రెండో టీ20లో ఆతిథ్య పాకిస్థాన్‌ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

Updated : 21 Apr 2024 04:22 IST

రావల్పిండి: న్యూజిలాండ్‌తో రెండో టీ20లో ఆతిథ్య పాకిస్థాన్‌ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. షహీన్‌ షా అఫ్రిది (3/13), అబ్రార్‌ (2/15), ఆమిర్‌ (2/13), షాదాబ్‌ ఖాన్‌ (2/15) ధాటికి మొదట కివీస్‌ 18.1 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌటైంది. మార్క్‌ చాప్‌మన్‌ (19) టాప్‌ స్కోరర్‌. రిజ్వాన్‌ (45 నాటౌట్‌) చెలరేగడంతో లక్ష్యాన్ని పాకిస్థాన్‌ 12.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఈ విజయంతో అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్‌ 1-0 ఆధిక్యం సంపాదించింది. వర్షం కారణంగా తొలి మ్యాచ్‌ రద్దయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని