దూకుడు ఫలితాన్నిచ్చింది

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది.

Published : 23 Apr 2024 03:22 IST

‘ఈనాడు’తో కోనేరు హంపి 

ఈనాడు, హైదరాబాద్‌: క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. ద్వితీయార్ధంలో గొప్పగా పుంజుకుని రన్నరప్‌గా నిలిచిన  హంపి ‘ఈనాడు’తో ఫోన్‌లో ముచ్చటించింది. ఆ వివరాలు హంపి మాటల్లోనే..

‘‘తొలి అర్ధ భాగం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయా. 7 రౌండ్లలో 2.5 పాయింట్లు మాత్రమే స్కోరు చేయగలిగా. ఒకదశలో చివరి స్థానానికి వెళ్లిపోయా. కానీ ద్వితీయార్ధంలో గాడినపడ్డా. చివరి రౌండ్లో రెండో స్థానంలో ఉన్న చైనా క్రీడాకారిణిపై గెలిచి రన్నరప్‌గా నిలవడం ఆనందాన్నిచ్చింది. టోర్నీలో ప్రతి ఒక్కరు మంచి సన్నద్ధతతో వచ్చారు. గతంలో కంటే ఎక్కువ పోటీ ఎదురైంది. దూకుడు పెంచితేనే ఫలితం వస్తుందని భావించా. ఆ ఆలోచన సత్ఫలితాన్నివ్వడంతో రెండో స్థానంలో టోర్నీని ముగించగలిగాను. ప్రథమార్ధంలో మెరుగ్గా ఆడుంటే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ బెర్తు దక్కేది. ఏదేమైనా వయసులో అందరి కంటే నేనే పెద్ద. ఆ లెక్కన మంచి ఫలితమనే చెప్పాలి. ఇక యువ ఆటగాడు గుకేశ్‌ అద్భుతంగా ఆడాడు. చాలా ప్రశాంతంగా ఆడుతూ వయసుకు మించిన పరిణతిని కనబరిచాడు. భారత్‌ గర్వించదగ్గ సందర్భమిది. గుకేశ్‌ తెలుగువాడే కావడం మనందరికీ గర్వకారణం’’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని