టొరంటోలో భారత భూకంపం

అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్‌ సంచలనం, గ్రాండ్‌మాస్టర్‌ గుకేశ్‌పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు.

Published : 24 Apr 2024 01:59 IST

గుకేశ్‌ విజయంపై కాస్పరోవ్‌

దిల్లీ: అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్‌ సంచలనం, గ్రాండ్‌మాస్టర్‌ గుకేశ్‌పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. టొరంటోలో భారత భూకంపంగా గుకేశ్‌ విజయాన్ని అతను కొనియాడాడు. ‘‘క్యాండిడేట్స్‌ టోర్నీలో విజయం సాధించి.. అత్యున్నత చెస్‌ టైటిల్‌ కోసం డింగ్‌  లిరెన్‌తో తలపడబోతున్న 17 ఏళ్ల గుకేశ్‌కు అభినందనలు. టొరంటోలో భారత భూకంపం చెస్‌ ప్రపంచంలో గొప్ప మలుపునకు దారి తీస్తుంది. గ్రాండ్‌ చెస్‌ టూర్లలో గుకేశ్‌ ఆటను చూసేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నాం. గుకేశ్‌ ఎదుగుదలను, అతడి విజయాలను కాస్పరోవ్‌ చెస్‌ ఫౌండేషన్‌ గమనిస్తోంది. అతను ఇంకా ఎత్తుకు ఎదుగుతాడు’’ అని కాస్పరోవ్‌ పేర్కొన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని