శ్రీజ నం.1

అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్‌లో కెరీర్‌లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ..

Published : 24 Apr 2024 02:01 IST

దిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్‌లో కెరీర్‌లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. మనిక బత్రాను వెనక్కి నెట్టి భారత నంబర్‌వన్‌ క్రీడాకారిణిగా నిలిచింది. మనిక ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 39వ స్థానంలో ఉంది. 25 ఏళ్ల శ్రీజ ఈ ఏడాది డబ్ల్యూటీటీ ఫీడర్‌ కార్పస్‌ కప్‌, డబ్ల్యూటీటీ ఫీడర్‌ బీరూట్‌ కప్‌లలో టైటిళ్లు గెలిచింది. గోవాలో జరిగిన స్టార్‌ కంటెండర్‌ టోర్నీలో క్వార్టర్స్‌ చేరింది. 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో శరత్‌కమల్‌తో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో పసిడి గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో శరత్‌కమల్‌ (37) అగ్రస్థానంలో నిలవగా.. సత్యన్‌ (61), మానవ్‌ థక్కర్‌ (61), హర్మీత్‌ దేశాయ్‌ (64) తర్వాతి ర్యాంకుల్లో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని