ధీరజ్‌ బృందానికి స్వర్ణం

ఆర్చరీ ప్రపంచకప్‌ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్‌ బొమ్మదేవర, తరుణ్‌దీప్‌రాయ్‌, ప్రవీణ్‌ జాదవ్‌తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్‌ టీమ్‌ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.

Published : 29 Apr 2024 01:51 IST

కొరియాకు షాకిచ్చిన భారత జట్టు

షాంఘై: ఆర్చరీ ప్రపంచకప్‌ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్‌ బొమ్మదేవర, తరుణ్‌దీప్‌రాయ్‌, ప్రవీణ్‌ జాదవ్‌తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్‌ టీమ్‌ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఆదివారం ఫైనల్లో భారత త్రయం 5-1తో ఒలింపిక్‌ ఛాంపియన్‌ దక్షిణ కొరియా జట్టుకు షాకిచ్చింది. 14 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో భారత్‌కు పురుషుల రికర్వ్‌ టీమ్‌ ఈవెంట్లో పసిడి దక్కింది. ఈ విజయంతో ఒలింపిక్‌ బెర్తు సాధించే అవకాశాలను కూడా భారత్‌ మెరుగుపర్చుకుంది. ధీరజ్‌ మరో పతకం కూడా గెలుచుకున్నాడు. అంకితతో కలిసి మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లో అతడు కాంస్యం సాధించాడు. ఈ జంట 6-0తో వాలెన్సియా- మతియాస్‌ గ్రాండె (మెక్సికో) జంటపై గెలిచింది. మహిళల వ్యక్తిగత రికర్వ్‌లో దీపిక కుమారి రజతంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఆమె 0-6తో ఆసియా క్రీడల ఛాంపియన్‌ లిమ్‌ సియోన్‌ చేతిలో పరాజయంపాలైంది. మొత్తంగా భారత్‌ అయిదు స్వర్ణాలు సహా ఎనిమిది పతకాలతో ప్రపంచకప్‌ను ముగించింది. తెలుగమ్మాయి జ్యోతిసురేఖ వ్యక్తిగత స్వర్ణంతో పాటు మిక్స్‌డ్‌, టీమ్‌ విభాగాల్లో పసిడి పతకాలు నెగ్గిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని