క్వార్టర్‌ఫైనల్లో మీరాబా

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత యువ షట్లర్‌ మీరాబా లువాంగ్‌ మైసనాం జోరు కొనసాగుతోంది.

Published : 17 May 2024 03:11 IST

థాయ్‌లాండ్‌ ఓపెన్‌

బ్యాంకాక్‌:  థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత యువ షట్లర్‌ మీరాబా లువాంగ్‌ మైసనాం జోరు కొనసాగుతోంది. అతడు క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాడు. గురువారం ప్రిక్వార్టర్‌ఫైనల్స్‌లో 21 ఏళ్ల మీరాబా 21-14, 22-20తో మాడ్స్‌ క్రిస్టోఫర్సన్‌ (డెన్మార్క్‌)ను ఓడించాడు. క్వార్టర్స్‌లో అతడికి అతిపెద్ద సవాల్‌ ఎదురుకానుంది. ప్రపంచ ఛాంపియన్‌ కున్లవత్‌ వితిసర్న్‌ (థాయ్‌లాండ్‌)ను ఢీకొననున్నాడు. మరోవైపు పురుషుల డబుల్స్‌లో భారత స్టార్‌ ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టికి ఎదురేలేదు. రెండో రౌండ్లో సాత్విక్‌ జంట 21-16, 21-11తో గ్జి సావో నాన్‌, జెంగ్‌ వీ హన్‌ (చైనా)పై అలవోకగా విజయాన్నందుకుంది. మహిళల సింగిల్స్‌లో అస్మిత చాలిహ పోరాటం ముగిసింది. అస్మిత 15-21, 21-12, 12-21తో టాప్‌ సీడ్‌ హన్‌ యు (చైనా) చేతిలో ఓడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు