మహి సరదాగా అలా

ఓటమి బాధను మర్చిపోవడానికి ఒక్కో ఆటగాడు ఒక్కో రకంగా ప్రయత్నిస్తుంటాడు. వేర్వేరు వ్యాపకాల్లో పడిపోతుంటారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ కెప్టెన్‌ ధోని తనదైన శైల్లో ద్విచక్రవాహనంపై చక్కర్లు కొట్టాడు.

Published : 21 May 2024 02:38 IST

రాంచి: ఓటమి బాధను మర్చిపోవడానికి ఒక్కో ఆటగాడు ఒక్కో రకంగా ప్రయత్నిస్తుంటాడు. వేర్వేరు వ్యాపకాల్లో పడిపోతుంటారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ కెప్టెన్‌ ధోని తనదైన శైల్లో ద్విచక్రవాహనంపై చక్కర్లు కొట్టాడు. రాంచి వీధుల్లో ద్విచక్రవాహనాన్ని పరుగులు పెట్టించిన అతను ఇంట్లోకి వెళ్తున్న సమయంలో ఓ అభిమాని తీసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్త్రతమైంది. టీమ్‌ఇండియా మాజీ సారథి ధోనీకి ద్విచక్రవాహనాలంటే పిచ్చి అనే సంగతి తెలిసిందే. ఐపీఎల్‌-17లో తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో శనివారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చేతిలో ఓడిన సీఎస్కే సీజన్‌ నుంచి నిష్క్రమించిన విషయం విదితమే. ఈ ఐపీఎల్‌ సీజనే ధోనీకి ఆఖరిదనే ఊహాగానాల నేపథ్యంలో ఆ ఓటమితో అతని అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని