అమెరికా అదరహో..

అమెరికా సంచలనం సృష్టించింది. బంగ్లాదేశ్‌కు వరుసగా రెండో టీ20లోనూ షాకిచ్చి చరిత్రాత్మక సిరీస్‌ విజయం సాధించింది.

Published : 25 May 2024 03:43 IST

బంగ్లాదేశ్‌పై టీ20 సిరీస్‌ కైవసం 

హూస్టన్‌: అమెరికా సంచలనం సృష్టించింది. బంగ్లాదేశ్‌కు వరుసగా రెండో టీ20లోనూ షాకిచ్చి చరిత్రాత్మక సిరీస్‌ విజయం సాధించింది. రెండో టీ20లో ఆరు పరుగుల తేడాతో గెలిచిన అమెరికా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యం సంపాదించింది. మొనాంక్‌ పటేల్‌ (42), ఆరన్‌ జోన్స్‌ (35), స్టీవెన్‌ టేలర్‌ (31) రాణించడంతో మొదట అమెరికా 6 వికెట్లకు 144 పరుగులు చేసింది. అలీ ఖాన్‌ (3/25), సౌరభ్‌ నేత్రావల్కర్‌ (2/15), షాల్‌క్విక్‌ (2/21) ధాటికి ఛేదనలో బంగ్లాదేశ్‌ 19.3 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌటైంది. నజ్ముల్‌ శాంటో (36) టాప్‌ స్కోరర్‌. ఈ సిరీస్‌ రెండు జట్లకు టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా పనిచేస్తుంది. పసికూన అమెరికా చేతిలో ఈ ఓటములు బంగ్లాకు అవమానమే. తొలి టీ20లో అమెరికా  5 వికెట్ల తేడాతో గెలిచింది. ఓ టాప్‌-10 టీ20 జట్టుపై నెగ్గడం యుఎస్‌ఏకు అదే తొలిసారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని