భారత షట్లర్లకు పరీక్ష

పారిస్‌ ఒలింపిక్స్‌ ముందు సత్తా చాటేందుకు భారత షట్లర్లకు మరో అవకాశం. మంగళవారం ఆరంభమయ్యే సింగపూర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో పి.వి.సింధు, ప్రణయ్, లక్ష్యసేన్‌ టైటల్‌ వేటకు దిగబోతున్నారు.

Published : 28 May 2024 02:53 IST

నేటి నుంచే సింగపూర్‌ ఓపెన్‌

సింగపూర్‌: పారిస్‌ ఒలింపిక్స్‌ ముందు సత్తా చాటేందుకు భారత షట్లర్లకు మరో అవకాశం. మంగళవారం ఆరంభమయ్యే సింగపూర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో పి.వి.సింధు, ప్రణయ్, లక్ష్యసేన్‌ టైటల్‌ వేటకు దిగబోతున్నారు. ఇటీవల మలేసియా మాస్టర్స్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన సింధు.. ఈ టోర్నీలో ఎలా రాణిస్తుందన్నది ఆసక్తికరం. చాన్నాళ్ల తర్వాత ఒక బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ టోర్నీలో తుదిపోరుకు చేరడం సింధు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈ నేపథ్యంలో ఆమె ఈసారి మరో అడుగు ముందుకేసి సింగపుర్‌ టైటిల్‌ నెగ్గుతుందేమో చూడాలి. సింధు తొలి రౌండ్లో హోజ్‌మార్క్‌ (డెన్మార్క్‌)తో తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ తొలి రౌండ్లో ప్రపంచ నం.1 అక్సెల్‌సెన్‌తో తలపడనున్నాడు. లువాంగ్‌ (థాయ్‌లాండ్‌)తో మ్యాచ్‌తో ప్రణయ్‌ టోర్నీని ఆరంభించనున్నాడు. పురుషుల డబుల్స్‌లో ఫేవరెట్స్‌గా బరిలో దిగుతున్న సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి.. లాండ్‌గార్డ్‌-వెస్టెర్‌గార్డ్‌ (డెన్మార్క్‌)తో తలపడబోతున్నారు. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, ప్రియాన్షు రజావత్‌.. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్‌.. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో, పుల్లెల గాయత్రి-ట్రీసా జోలీ కూడా ఈ టోర్నీ బరిలో ఉన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని