ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్‌

ఇండోనేసియా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 1000 టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో లక్ష్యసేన్‌ 21-12, 21-17తో కెంటా సునెయామ (జపాన్‌)పై నెగ్గి ప్రిక్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టాడు.

Published : 05 Jun 2024 03:04 IST

జకార్త: ఇండోనేసియా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 1000 టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో లక్ష్యసేన్‌ 21-12, 21-17తో కెంటా సునెయామ (జపాన్‌)పై నెగ్గి ప్రిక్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టాడు. ప్రియాన్షు రజావత్‌ 21-17, 21-12తో హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌పై గెలిచి ముందంజ వేశాడు. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ జోడీ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో గాయత్రి- ట్రీసా జోడీ 21-15, 21-11తో చెన్‌ పీ- సున్‌ యు (చైనీస్‌ తైపీ) జంటపై గెలుపొందింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్లో సుమీత్‌రెడ్డి- సిక్కిరెడ్డి జంట 18-21, 21-16, 21-17తో విన్సన్‌- జెనీ (అమెరికా) జోడీపై నెగ్గి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. 


ఇషాకు ఆరో స్థానం

మ్యూనిక్‌: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌లో తెలుగమ్మాయి ఇషా సింగ్‌కు నిరాశ ఎదురైంది. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఫైనల్లో ఇషా ఆరో స్థానంలో నిలిచింది. కెమిలీ జెద్రెజెవ్‌స్కీ (ఫ్రాన్స్‌) స్వర్ణం, డొరీన్‌ వెన్‌కాంప్‌ (జర్మనీ) రజతం సాధించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లోనూ భారత క్రీడాకారిణి రమిత జిందాల్‌ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ టోర్నీలో చైనా మూడు స్వర్ణాలతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని