టాప్‌-5లో అర్జున్‌

తెలంగాణ కుర్రాడు అర్జున్‌ ఇరిగేశి ఫిడే ర్యాంకింగ్స్‌లో టాప్‌-5లో చోటు దక్కించుకున్నాడు. లైవ్‌ రేటింగ్‌లో 2769.7 పాయింట్లతో టాప్‌ భారత ఆటగాడిగా ఉన్న అర్జున్‌..

Published : 05 Jun 2024 03:05 IST

 

దిల్లీ: తెలంగాణ కుర్రాడు అర్జున్‌ ఇరిగేశి ఫిడే ర్యాంకింగ్స్‌లో టాప్‌-5లో చోటు దక్కించుకున్నాడు. లైవ్‌ రేటింగ్‌లో 2769.7 పాయింట్లతో టాప్‌ భారత ఆటగాడిగా ఉన్న అర్జున్‌.. తాజా ర్యాంకింగ్స్‌లో అయిదో స్థానంలో నిలిచాడు. మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే, 2834.5), నకముర (అమెరికా, 2803.5), ఫాబియానో కరువానా (అమెరికా, 2796.7), నెపోమ్నియాషి (రష్యా, 2770.0).. అర్జున్‌ కంటే ముందున్నారు. గత కొన్ని నెలలుగా స్థిరంగా రాణిస్తున్న అర్జున్‌.. సీజ్‌మ్యాన్‌ చెస్‌ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచాడు. షార్జా మాస్టర్స్‌ చెస్‌లో ఉమ్మడిగా అయిదో స్థానం సాధించిన అతడు.. ఈ ఏప్రిల్‌లో మెనోర్కా ఓపెన్‌లో టైటిల్‌ గెలుచుకున్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని