ఒలింపిక్స్‌లో బోపన్న భాగస్వామి బాలాజీ

పారిస్‌ ఒలింపిక్స్‌లో టెన్నిస్‌ పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న.. తన భాగస్వామిగా శ్రీరామ్‌ బాలాజీని ఎంచుకున్నాడు. తాజా ఫ్రెంచ్‌ ఓపెన్లో బాలాజీ ప్రదర్శన నేపథ్యంలో అతడి పేరును అఖిల భారత టెన్నిస్‌ సమాఖ్యకు బోపన్న పంపించాడు.

Published : 05 Jun 2024 03:06 IST

దిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌లో టెన్నిస్‌ పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న.. తన భాగస్వామిగా శ్రీరామ్‌ బాలాజీని ఎంచుకున్నాడు. తాజా ఫ్రెంచ్‌ ఓపెన్లో బాలాజీ ప్రదర్శన నేపథ్యంలో అతడి పేరును అఖిల భారత టెన్నిస్‌ సమాఖ్యకు బోపన్న పంపించాడు. డబుల్స్‌లో నంబర్‌వన్‌ ర్యాంకులో ఉన్న 44 ఏళ్ల బోపన్నకు ఒలింపిక్స్‌లో ఆడే తన భాగస్వామిని ఎంచుకునే అవకాశం ఉంది. ఫ్రెంచ్‌ ఓపెన్లో మార్టినెజ్‌ (మెక్సికో) జతగా బాలాజీ మూడో రౌండ్‌ చేరాడు. అక్కడ బోపన్న-ఎబ్డెన్‌ జోడీ చేతిలో బాలాజీ ద్వయం ఓడింది. 2016 రియో ఒలింపిక్స్‌లో సానియా మీర్జా జతగా మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బోపన్న కొద్దిలో పతకం కోల్పోయాడు. ‘‘బాలాజీతో కలిసి ఒలింపిక్స్‌లో ఆడతానని రోహన్‌ లేఖ రాశాడు. అతడు ఇటీవల పాకిస్థాన్‌తో డేవిస్‌కప్‌లోనూ బాలాజీ రాణించాడు. ఫ్రెంచ్‌ ఓపెన్లోనూ సత్తా చాటాడు’’ అని ఐటీఎఫ్‌ కార్యదర్శి అనిల్‌ దాపర్‌ తెలిపాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని