పరిస్థితులు మారాయి.. ఎన్‌ఓసీ వచ్చింది

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పరిస్థితులు మారడంతో తనకు నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) లభించిందని భారత టెస్టు క్రికెటర్‌ గాదె హనుమ విహారి అన్నాడు. రెండు నెలలుగా ఎన్‌ఓసీ అడుగుతున్నా ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) పట్టించుకోలేదని తెలిపాడు.

Published : 05 Jun 2024 03:07 IST

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పరిస్థితులు మారడంతో తనకు నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) లభించిందని భారత టెస్టు క్రికెటర్‌ గాదె హనుమ విహారి అన్నాడు. రెండు నెలలుగా ఎన్‌ఓసీ అడుగుతున్నా ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) పట్టించుకోలేదని తెలిపాడు. ఆంధ్ర రంజీ జట్టు సారథ్యం నుంచి తనను అర్ధంతరంగా తప్పించడంపై అసంతృప్తి వ్యక్తంజేసిన విహారి.. ఆంధ్రకు మళ్లీ ఆడబోనంటూ ప్రకటించాడు. దీనిపై ఈ ఏడాది మార్చిలో విహారికి ఏసీఏ షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. మరోవైపు దేశవాళీ సీజన్‌లో మరో రాష్ట్రం తరఫున ఆడేందుకు ఎన్‌ఓసీ ఇవ్వాలంటూ ఏసీఏకు విహారి పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. ‘‘రెండు నెలలుగా ఎన్‌ఓసీ కోసం అడుగుతున్నా. నాలుగు సార్లు ఈమెయిల్‌ చేశా. అయినా ఎన్‌ఓసీ ఇవ్వలేదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. వెంటనే ఎన్‌ఓసీ ఇచ్చారు’’ అంటూ మంగళవారం ‘ఎక్స్‌’లో విహారి పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని