ప్రజ్ఞానందకు మూడో స్థానం

నార్వే చెస్‌ టోర్నమెంట్లో భారత స్టార్‌ ప్రజ్ఞానంద మూడో స్థానం సాధించాడు. శనివారం చివరిదైన పదో రౌండ్లో నకముర (అమెరికా)పై గెలిచిన ప్రజ్ఞానంద.. సంతృప్తికరంగా టోర్నీని ముగించాడు.

Published : 09 Jun 2024 03:54 IST

స్టావెంజర్‌: నార్వే చెస్‌ టోర్నమెంట్లో భారత స్టార్‌ ప్రజ్ఞానంద మూడో స్థానం సాధించాడు. శనివారం చివరిదైన పదో రౌండ్లో నకముర (అమెరికా)పై గెలిచిన ప్రజ్ఞానంద.. సంతృప్తికరంగా టోర్నీని ముగించాడు. మొత్తం మీద అతడు 14.5 పాయింట్లతో టాప్‌-3లో నిలిచాడు. మరోవైపు మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (17.5, నార్వే) టైటిల్‌ దక్కించుకున్నాడు. మహిళల విభాగంలో చివరి రౌండ్లో అనా ముజ్‌చుక్‌ (ఉక్రెయిన్‌) చేతిలో ఓడిన కోనేరు హంపి (10) అయిదో స్థానంలో నిలిచింది. వైశాలి (12.5) కాస్త మెరుగ్గా నాలుగో స్థానాన్ని సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని