పూజ సరికొత్త చరిత్ర

అల్టిమేట్‌ ఫైటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ (యూఎఫ్‌సీ)లో భారత క్రీడాకారిణి పూజ తోమర్‌ చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక టోర్నీలో అరంగేట్ర మ్యాచ్‌లోనే పూజ విజయంతో అదరగొట్టింది.

Published : 10 Jun 2024 04:20 IST

లూయిస్‌విల్లే: అల్టిమేట్‌ ఫైటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ (యూఎఫ్‌సీ)లో భారత క్రీడాకారిణి పూజ తోమర్‌ చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక టోర్నీలో అరంగేట్ర మ్యాచ్‌లోనే పూజ విజయంతో అదరగొట్టింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో పూజ 30-27, 27-30, 29-28తో రేయాన్‌ శాంటోస్‌ (బ్రెజిల్‌)పై గెలుపొందింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన పూజ.. ఈ విజయాన్ని భారత ఫైటర్లు, ఎమ్‌ఎమ్‌ఏ అభిమానులకు అంకితమిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని