అలా అన్న వారే.. ఇప్పుడిలా!

ఒక్క సంవత్సరం వ్యవధిలోనే తన పట్ల అభిప్రాయం మారిపోయిందని భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అన్నాడు. 2022లో వెన్నుకు శస్త్రచికిత్స చేయించుకున్న బుమ్రా.. ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు.

Published : 11 Jun 2024 03:17 IST

న్యూయార్క్‌: ఒక్క సంవత్సరం వ్యవధిలోనే తన పట్ల అభిప్రాయం మారిపోయిందని భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అన్నాడు. 2022లో వెన్నుకు శస్త్రచికిత్స చేయించుకున్న బుమ్రా.. ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. సొంతగడ్డపై ద్వైపాక్షిక సిరీస్‌లో పునరాగమనానికి ముందు గాయం తిరగబెట్టడంతో 10 నెలలు ఆటకు దూరంగా ఉన్నాడు. ‘‘ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్లే ఏడాది కిందట నేను మళ్లీ ఆడలేనని చెప్పారు. నా కెరీర్‌ ముగిసిందన్నారు. ఇప్పుడు ప్రశ్న మారిపోయింది. ఎప్పుడైనా నా సామర్థ్యం మేరకు బౌలింగ్‌ చేస్తున్నానా లేదా అన్నది చూడను. నా ముందున్న సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తా. ఇలాంటి పిచ్‌పై అత్యుత్తమం ఏంటన్నదే ఆలోచిస్తా’’ అని బుమ్రా వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని