
Published : 21 Jan 2022 01:43 IST
ఐఎస్‌ఎల్ మ్యాచ్ వాయిదా
బంబోలిం: జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ, ముంబయి సిటీ మధ్య శుక్రవారం జరగాల్సిన ఐఎస్‌ఎల్ మ్యాచ్ వాయిదా పడింది. రెండు జట్లలో అనేకమంది ఆటగాళ్లు కరోనా బారినపడడమే అందుకు కారణం. కొవిడ్ కారణంగా ఇంతకుముందు కూడా కొన్ని ఐఎస్‌ఎల్ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. ‘‘జంషెడ్‌పూర్, ముంబయి సిటీ మధ్య మ్యాచ్ వాయిదా పడింది. జంషెడ్‌పూర్.. జట్టును బరిలోకి దించే స్థితిలో లేదు. లీగ్ వైద్య బృందం సలహా మేరకు నిర్ణయం తీసుకున్నాం’’ అని ఐఎస్‌ఎల్ ఓ ప్రకటనలో తెలిపింది.
Tags :