Glenn Maxwell: రోహిత్‌ శర్మ సరసన గ్లెన్‌ మాక్స్‌వెల్‌!

Eenadu icon
By Sports News Team Published : 18 Jun 2025 12:01 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2025లో (Major League Cricket) లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియన్‌ ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌ (Glenn Maxwell) వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌ జట్టు తరఫున ఆడాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 49 బంతుల్లో 216.33 స్ట్రైక్‌రేట్‌తో 106 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 2 ఫోర్లు, 13 సిక్స్‌లున్నాయి. ఇది మాక్స్‌వెల్‌కు పొట్టి ఫార్మాట్‌లో ఎనిమిదో శతకం.  ఈ సెంచరీతో అతడు టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు కొట్టిన బ్యాటర్లలో నాలుగో స్థానంలో రోహిత్‌ శర్మ (Rohit Sharma), జోస్‌ బట్లర్‌, అరోన్‌ ఫించ్‌, డేవిడ్‌ వార్నర్‌ (David Warner) సరసన నిలిచాడు. 

మ్యాక్స్‌వెల్‌ టీ20ల్లో 10,500 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అలాగే 178 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో 10,500 పరుగులు, 170 ప్లస్‌ వికెట్లు, అయిదు కంటే ఎక్కువ సెంచరీలు సాధించిన తొలి ఆసిస్‌ క్రికెటర్‌గా నిలిచాడు. కాగా ఈ ఫార్మాట్‌లో వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ క్రిస్ గేల్‌ 22 సెంచరీలు సాధించాడు. తర్వాతి స్థానంలో పాకిస్థాన్‌ క్రికెటర్‌ బాబర్‌ ఆజమ్‌ 11 శతకాలతో ఉన్నాడు. సౌతాఫ్రికా బ్యాటర్‌ రిలీ రోసోవ్‌, టీమ్‌ఇండియా (Team India) బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) 9 సెంచరీలతో సంయుక్తంగా తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు. 

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌ జట్టుకు మాక్స్‌వెల్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గత సీజన్‌లో జట్టుకు కెప్టెన్‌గా టైటిల్‌ అందించిన స్టీవ్ స్మిత్‌ గైర్హాజరీలో అతడు సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాక్స్‌వెల్‌ వీరవిహారం చేయడంతో వాషింగ్టన్‌ జట్టు 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని