RCB: ఇది గొప్ప బ్యాటింగ్‌ పిచ్‌.. మా కుర్రాళ్లు సిద్ధంగా ఉన్నారు : డుప్లెసిస్‌

బెంగళూరు వేదికగా నేడు పంజాబ్‌ కింగ్స్‌(RCB vs PKS)తో ఆర్సీబీ తలపడనుంది.

Published : 25 Mar 2024 16:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటమితో ఈ ఐపీఎల్‌ సీజన్‌(IPL)ను ప్రారంభించిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(Royal Challengers Bengaluru) నేడు పంజాబ్‌ కింగ్స్‌(RCB vs PKS) తో రెండో మ్యాచ్‌లో తలపడనుంది. సొంత మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి ఖాతా తెరవాలని భావిస్తోంది. తమకు అచ్చొచ్చే చిన్నస్వామి స్టేడియంపై ఆ జట్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌ స్పందించాడు. 

‘మేం తొలి మ్యాచ్‌లో చెన్నైతో ఓడిపోయాం. అక్కడ చెన్నై అభిమానుల మద్దతు ఆ జట్టుకు భారీగా ఉంది. బెంగళూరులో ఆడేందుకు ఎదురు చూస్తున్నాను. ఇది బ్యాటింగ్‌ చేయడానికి గొప్ప ప్లేస్‌. మా కుర్రాళ్లు కూడా సిద్ధంగా ఉన్నారు’ అని మ్యాచ్‌కు ముందు డుప్లెసిస్‌(Faf Du Plessis) అన్నాడు. ఇది గొప్ప బ్యాటింగ్‌ పిచ్‌ అని.. ఔట్‌ ఫీల్డ్‌ ఎంతో వేగంగా స్పందిస్తుందని ఆ జట్టు ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ పేర్కొన్నాడు.

ఇక చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఇప్పటివరకూ 84 మ్యాచ్‌లు ఆడింది. 39 మ్యాచ్‌ల్లో విజయాలు నమోదుచేయగా.. 40 గేమ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్‌ టై కాగా, నాలుగు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ సొంత మైదానాల్లో ఆడిన జట్లన్నీ విజయాలను నమోదు చేశాయి. మరి నేటి మ్యాచ్‌లో బెంగళూరు ఆ ఆనవాయితీని కొనసాగిస్తుందో, లేదో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని