‘ఆమె’ సంకల్పమే భారత్‌ను అగ్రస్థానంలో నిలిపింది.. దీప కర్మాకర్‌పై మహీంద్రా ప్రశంసలు

ఆసియా జిమ్నాస్టిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో దీప కర్మాకర్‌ స్వర్ణం సాధించడంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా హర్షం వ్యక్తంచేశారు. 

Published : 27 May 2024 17:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆసియా జిమ్నాస్టిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి.. దీప కర్మాకర్‌ (Dipa Karmakar) చరిత్ర సృష్టించింది. ఛాంపియన్‌షిప్‌లో ఈ ఘనత సాధించిన భారత తొలి క్రీడాకారిణిగా నిలిచింది. ఆమె స్వర్ణం సాధించడంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) హర్షం వ్యక్తంచేశారు. ఎన్నో ఒడిదొడుకులను దాటుకుని ఈ ఘనత సాధించిందంటూ దీపపై ప్రశంసలు కురిపించారు.

‘‘గతంలో తనకు తగిలిన గాయం, ఎదురైన ఎన్నో అడ్డంకుల గురించి దీప కర్మాకర్‌ ఇటీవల మాట్లాడారు. క్రీడలపై ఉన్న ప్రేమే తనను ముందుకునడిపిస్తోందని చెప్పారు. జీవితంలో ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ప్రతిష్ఠాత్మక ఆసియన్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించారు. ఆమె సంకల్పమే ప్రపంచ వేదికపై మన దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టింది. తన పట్టుదల ఎంతోమందికి స్పూర్తిని కలిగిస్తోంది.  దీప.. ఇలాగే ముందుకుసాగాలి..’’ అని ఆనంద్‌ మహీంద్రా ప్రశంసించారు.

పదేళ్లపాటు ఉండేలా.. గంభీర్‌కు ‘బ్లాంక్‌ చెక్’ ఆఫరిచ్చిన షారుక్‌ ఖాన్‌!

ప్రతి వారం మండే మోటివేషన్‌గా ఒక అంశంపై ఆనంద్‌ మహీంద్రా నెటిజన్లతో పంచుకుంటుంటారు. దీప సాధించిన విజయంపై ఆయన చేసిన పోస్టు వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన నెటిజన్లు.. ‘‘ఆమె సంకల్పమే.. ప్రపంచ వేదికపై భారత్‌ను ఉన్నతస్థాయిలో నిలిపింది’’ అని ఒకరు.. ‘‘మాతో చక్కటి విషయాలు పంచుకుంటున్న మహీంద్రాకు ధన్యవాదాలు’’, ‘‘మీ మోటివేషన్‌ మాపై ఎంతో ప్రభావం చూపుతుంది’’ అని కామెంట్లు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని