IPL 2024: కెప్టెన్సీ మార్పు తర్వాత తొలిసారి ఎదురుపడ్డ హార్దిక్‌, రోహిత్‌.. ఏం జరిగిందంటే?

IPL 2024: ఐపీఎల్‌ 2024 సీజన్‌లో రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్య పేరు జోరుగా వినిపిస్తోంది. ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్సీ మార్పే ఇందుకు కారణం. జట్టు ట్రైనింగ్‌ సెషన్‌లో వీరిద్దరూ తొలిసారి ఎదురుపడ్డారు. 

Updated : 21 Mar 2024 08:07 IST

ముంబయి: ఐపీఎల్‌ 2024కు (IPL) సర్వం సిద్ధమైంది. జట్లు శిక్షణను ముమ్మరం చేశాయి. ముంబయి జట్టు (Mumbai Indians) ఈసారి ఎక్కువగా చర్చల్లో నిలిచింది. కెప్టెన్సీ మార్పే దీనికి కారణం. ఐదుసార్లు జట్టుకు విజయాన్నందించిన రోహిత్‌ శర్మను తొలగించి నాయకత్వ బాధ్యతలను హార్దిక్‌ పాండ్యకు (Hardik Pandya) అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఓ దశలో పాండ్య నాయకత్వంలో రోహిత్‌ (Rohit Sharma) ఆడతాడా? అనే అనుమానాలూ వ్యక్తమయ్యాయి. ఇలాంటి పరిణామాల తర్వాత వీళ్లిద్దరూ తొలిసారి మైదానంలో ఎదురుపడ్డారు.

ముంబయి ఇండియన్స్‌ జట్టు ట్రైనింగ్‌ సెషన్‌ సమయంలో రోహిత్‌, పాండ్య (Hardik Pandya) కలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను జట్టు యాజమాన్యం సోషల్‌ మీడియాలో పంచుకుంది. ఇప్పుడు ఇది వైరలవుతోంది. రోహిత్‌ (Rohit Sharma)ను చూసిన పాండ్య వెంటనే అతడి దగ్గరకు వెళ్లి కౌగిలించుకున్నారు. తర్వాత వీరిద్దరి మధ్య సరదా సంభాషణ జరిగినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది.

వాళ్లతో కలసి ఆడడాన్ని ఆస్వాదించా: రోహిత్‌

కెప్టెన్సీ మార్పుపై పాండ్య (Hardik Pandya) ఇటీవల స్పందించిన విషయం తెలిసిందే. రోహిత్‌ సారథ్యంలో ముంబయి జట్టు ఎలాంటి విజయాలను అందుకుందో అందరికీ తెలిసిందే అంటూ అతణ్ని కొనియాడాడు. తన నాయకత్వంలో ఆడడానికి రోహిత్‌ ఏమాత్రం ఇబ్బంది పడబోడని చెప్పాడు. జట్టును నడపడంలో తప్పకుండా అతడి సాయం తీసుకుంటానని తెలిపాడు. రోహిత్‌ సూచనలు, సలహాలతో విజయాన్నందిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. మార్చి 24న గుజరాత్‌ టైటాన్స్‌- ముంబయి ఇండియన్స్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు