ఆ కుర్రాళ్లు చాలా తుంటరులు... వాళ్లతో ఆడడాన్ని ఆస్వాదించా: రోహిత్‌ శర్మ

ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో అరంగేట్ర కుర్రాళ్లలో కలిసి ఆడడాన్ని ఆస్వాదించానని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. వారి అరంగేట్రం భావోద్వేగాన్ని కలిగించిందని చెప్పాడు.

Published : 21 Mar 2024 09:14 IST

దిల్లీ: ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో అరంగేట్ర కుర్రాళ్లలో కలిసి ఆడడాన్ని ఆస్వాదించానని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. వారి అరంగేట్రం భావోద్వేగాన్ని కలిగించిందని చెప్పాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌ ద్వారా రజత్‌ పటీదార్‌, ధ్రువ్‌ జురెల్‌, సర్ఫరాజ్‌ఖాన్‌, ఆకాశ్‌ దీప్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌ తమ అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించిన సంగతి తెలిసిందే.

‘‘వాళ్లతో ఆడడాన్ని ఆస్వాదించా. ఆ కుర్రాళ్లు చాలా తుంటరులు. వాళ్లలో చాలా మంది నాకు బాగా తెలుసు. వారి బలాలు, వాళ్లు ఎలా ఆడాలనుకుంటారో తెలుసు. వాళ్లు ఎంత మంచి ఆటగాళ్లో చెప్పడం, గతంలో ఎంత బాగా రాణించారో చెప్పడం ద్వారా వారిని ప్రోత్సహించడం నా బాధ్యత. వాళ్లు స్పందించిన తీరు అద్భుతం’’ అని రోహిత్‌ అన్నాడు. ‘‘ఈ అరంగేట్ర కుర్రాళ్లతో ఆడుతూ మైమరిచిపోయా. వాళ్ల తల్లిదండ్రులూ అక్కడే ఉన్నారు. ఎంతో భావోద్వేగం. ఆ కుర్రాళ్ల అరంగేట్రాన్ని చూడడం ఎంతో సంతోషాన్నిచ్చింది. నేను కుర్రాడిగా ఉన్నప్పుడు కంగా లీగ్‌లో సర్ఫరాజ్‌ తండ్రితో కలిసి ఆడా’’ అని చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని