Shikhar Dhawan: మిథాలీతో నా పెళ్లి అని రాశారు: శిఖర్‌ ధావన్‌

Shikhar Dhawan: ప్రముఖ మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ను తాను పెళ్లి చేసుకుంటున్నట్లు అప్పట్లో వార్తలు రాశారని క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ అన్నాడు.

Published : 24 May 2024 19:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనపై వచ్చిన వదంతుల గురించి టీమ్‌ఇండియా క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ (Shikhar Dhawan) తాజాగా పంచుకున్నాడు. ఒకానొక సమయంలో ఓ మహిళా క్రికెటర్‌తో తన పెళ్లి గురించి కొంతమంది ప్రచారం చేశారని చెప్పాడు. ‘ధావన్‌ కరేంగే’ షోలో మాట్లాడుతూ గబ్బర్‌ నాటి సంగతులను గుర్తుచేసుకున్నాడు. ‘‘నాపై అనేక ప్రచారాలు వచ్చాయి. నేను మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (Mithali Raj)ను పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వదంతులు వచ్చాయి’’ అని తెలిపాడు.

ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్‌ ఆయేషా ముఖర్జీని ధావన్‌ 2012లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడున్నారు. మనస్పర్థలు రావడంతో కొంతకాలం దూరంగా ఉన్న వీరు తాము విడిపోతున్నట్లు 2021లో ప్రకటించారు. ఈ క్రమంలోనే తన భార్య మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ.. ధావన్‌ దిల్లీలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. గతేడాది వీరికి విడాకులు మంజూరయ్యాయి.

థ్యాంక్యూ డీకే.. ఆ సమయంలో ఎంతో స్ఫూర్తి పొందా: విరాట్ కోహ్లీ

అయితే, తాము విడిపోతున్నట్లు ధావన్‌ ప్రకటించిన తర్వాత కొన్నాళ్లకు అతడి పెళ్లిపై ఊహాగానాలు వచ్చాయి. ప్రముఖ మహిళా క్రికెటర్‌తో ఆయన ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అప్పట్లో దీనిపై ధావన్‌ గానీ, మిథాలీ గానీ స్పందించలేదు.

కెరీర్‌ పరంగా ధావన్‌ కొంతకాలంగా టీమ్‌ఇండియా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. తాజాగా జరుగుతున్న ఐపీఎల్‌ టోర్నీలో పంజాబ్‌ జట్టు కెప్టెన్‌ అయిన అతడు కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 152 పరుగులు చేశాడు. ఆ తర్వాత గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇక మిథాలీ రాజ్‌ ప్రస్తుతం మహిళా ప్రీమియర్‌ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు