IPL 2024 Final: ఐపీఎల్‌ ఫైనల్‌... వీళ్ల మధ్య పోరు ఆసక్తికరం.. ఎవరి మీద ఎవరిది పై చేయి అంటే?

IPL 2024 Tactics & Matchup: ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ నేపథ్యంలో.. ఇరు జట్ల ఆటగాళ్లను ఓసారి పోల్చి చూసుకుంటే.. ఆసక్తికర అంశాలు చాలానే ఉన్నాయి. 

Updated : 26 May 2024 17:10 IST

ఐపీఎల్‌ (IPL) 17వ సీజన్‌ ఫైనల్ మరికొన్ని గంటల్లో మొదలుకానుంది. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knight Riders)- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) ఈ మ్యాచులో ఎలాంటి రికార్డులు నమోదు కావొచ్చు. ఎవరు మెరవొచ్చు. గతంలో ఇరుజట్లు ఎదురుపడినప్పుడు ఏం జరిగిందో చూద్దాం!

  • క్వాలిఫయర్‌ 1 మ్యాచులో వేసిన రెండో బంతికే ట్రావిస్‌ హెడ్‌ను మిచెల్‌ స్టార్క్‌ ఔట్‌ చేశాడు. అప్పుడు ‘హెడ్‌ కోసం తన దగ్గర ఓ బంతి ఉందని, అతనెప్పుడు ఎదురుపడినా దానిని సంధిస్తాను’ అని చెప్పాడు. మరి ఈసారి ఏం అవుతుందో చూడాలి?
  • ఎస్‌ఆర్‌హెచ్‌ కుర్ర హిట్టర్‌ అభిషేక్‌ శర్మను కోల్‌కతా పవర్‌ హౌస్‌ ఆండ్రూ రసెల్‌ రెండు సార్లు  (12 బంతుల్లో) ఔట్‌ చేశాడు. ఇప్పుడు అభిషేక్‌ మూడో ఛాన్స్‌ ఇస్తాడా? ప్రతీకారం తీర్చుకుంటాడా?
  • కేకేఆర్‌ స్టార్‌ బౌలర్ల మీద హైదరాబాద్‌ పవర్‌ హిట్టర్‌ క్లాసెన్‌కు బీభత్సమైన రికార్డు ఉంది. వరుణ్‌ చక్రవర్తి, మిచెల్‌ స్టార్క్‌ను ఎదుర్కొన్నప్పుడు క్లాసెస్‌ స్ట్రయిక్‌ రేటు 200కిపైనే. ఆ నెంబరు ఈ రోజూ కనిపిస్తుందా?
  • స్పిన్నర్లు అంటే రెచ్చిపోయే అభిషేక్‌ శర్మ.. కోల్‌కతా బౌలర్లనూ ఓ ఆట ఆడుకున్నాడు. వారి మీద అభిషేక్‌కి 175కి పైగా స్ట్రయిక్‌ రేట్‌ ఉంది. ఆ ఆట కొనసాగిస్తాడా?
  • ఆండ్రూ రసెల్‌ విషయానికి వస్తే క్లాసెన్‌ కామ్‌గానే ఉంటాడు. రసెల్‌ వేసిన 10 బంతుల్లో క్లాసెస్‌ కేవలం 12 పరుగులే చేశాడు. ఫైనల్‌లోనూ ఇదే జరుగుతుందా?
  • ఎస్‌ఆర్‌హెచ్‌ టాప్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను ఎదుర్కోవడం ఆండ్రూ రసెల్‌కు ఇష్టం. భువీ వేసిన 37 బంతుల్లో 97 పరుగులు చేశాడు రసెల్‌. నటరాజన్‌, ఉనద్కత్‌కు కూడా ఇలాంటి హిట్టింగ్‌ ట్రీట్మెంటే ఇచ్చాడు. ఈ రోజు రసెల్‌ ప్లాన్‌ ఏంటో?
  • సీజన్‌ మొత్తం అదరగొట్టిన సునీల్ నరైన్‌ క్వాలిఫయర్‌ 1లో కమిన్స్‌ బౌలింగ్‌లో ఇబ్బంది పడుతూ వికెట్‌ ఇచ్చేశాడు. మిగిలిన బౌలర్లను ఎదుర్కోవడంలోనూ తడబడ్డాడు. మరి నరైన్‌ ఏమైనా హోం వర్క్‌ చేశాడేమో చూడాలి. 
  • వెంకటేశ్‌ అయ్యర్‌ను నటరాజన్‌ ఇప్పటివరకు ఏడుసార్లు ఔట్‌ చేశాడు. ఈ మ్యాచులో అది ఎనిమిది అవుతుందో లేదో చూడాలి. అయితే అర్ధ శతకం బాదిన ఊపులో ఉన్నాడు మరి అయ్యర్‌.
  • చెపాక్‌ మైదానంలో మొత్తం 83 క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు 58 శాతం నెగ్గగా, మొదట బౌలింగ్‌ చేసిన టీమ్స్‌ 41 శాతం గెలిచాయి. ఇవాళ ఏ సూచీ పెరుగుతుందో? 
  • స్పిన్‌కు అనుకూలించే పిచ్‌ అని పేరున్న చెపాక్‌లో జరిగిన గత పది మ్యాచుల్లో పేసర్లు 89 వికెట్లు పడగొట్టగా, 29 వికెట్లు స్పిన్నర్లకు దక్కాయి. ఈ రోజు ఎవరికెన్ని వస్తాయో?

ఆఖరిగా గత ఆరు సీజన్లుగా పాయింట్ల పట్టికలో నెంబర్‌ 1గా ప్లేఆఫ్స్‌కు చేరిన టీమే కప్‌ గెలుస్తూ వచ్చింది. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు