Hyderabad Vs Bengaluru: హైదరాబాద్‌కు ‘ఉప్పల్‌’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?

భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్‌ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది.

Updated : 25 Apr 2024 10:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: 287.. 266.. ఇవి గత మూడు మ్యాచుల్లో రెండుసార్లు హైదరాబాద్‌ చేసిన స్కోర్లు. ఇప్పుడు మరోసారి ఇలాంటి పరుగుల సునామీ రాబోతోందా? ఐపీఎల్‌ అభిమానులు ఆశపడుతున్న 300+ నమోదు కాబోతోందా? ఈరోజు జరగబోయే బెంగళూరు మ్యాచ్‌లో ఆ గణంకాలను చూస్తామా? 

  • డేంజరస్‌ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను వణికిస్తున్న హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. బెంగళూరును మరోసారి ఓడించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకాలని ఉవ్విళ్లూరుతోంది.
  • డబుల్ హ్యాట్రిక్‌ ఓటములతో అట్టడుగు స్థానానికి పడిపోయిన ఆర్సీబీ గౌరవంగా సీజన్‌ ముగించాలన్నా.. ఈ మ్యాచ్‌లో నెగ్గి తిరిగి విన్నింగ్‌ ట్రాక్‌ ఎక్కాల్సిందే.
  • సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ భారీ స్కోరును (287) సమర్పించిన బెంగళూరుకు గెలుపు అంత సులువేం కాదు. పేలవమైన బౌలింగ్‌తో సొంత గడ్డ మీద కమిన్స్‌ టీమ్‌ను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
  • ఇప్పటివరకు ఇరు జట్లూ 24 సార్లు తలపడగా.. హైదరాబాద్‌ 13 మ్యాచుల్లో, బెంగళూరు 10 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచ్‌లో ఎలాంటి ఫలితం తేలలేదు. 
  • భాగ్యనగర జట్టు ట్రావిస్ హెడ్ - అభిషేక్ శర్మ దూకుడుతో ఇప్పటికే పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు (125) చేసింది. ఆ జోరు కొనసాగిస్తే ఈ రికార్డూ బద్దలే. 
  • హెన్రిచ్‌ క్లాసెన్‌, అబ్దుల్ సమద్, నితీశ్‌రెడ్డి మరోసారి వరుసగా బంతిని జనాల్లోకి తరలిస్తే... ఉప్పల్‌లో 300+ స్కోరు పక్కా అని చెప్పొచ్చు. 
  • ఉప్పల్ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 277 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబయి 246 వరకూ వచ్చింది.
  • ఇరు జట్ల మధ్య జరిగిన గత ఐదు మ్యాచుల్లో బెంగళూరు రెండింట గెలవగా.. హైదరాబాద్‌ మూడు గెలుచుకుంది. 
  • ఆరెంజ్‌ క్యాప్‌ (అత్యధిక పరుగులు) రేసులో తొలి స్థానంలో విరాట్‌ కోహ్లీ (379) ఉన్నాడు. 55 పరుగుల దూరంలో ట్రావిస్ హెడ్‌ (324) ఉన్నాడు. దీంతో ఈ పోరు ఆరెంజ్‌ క్యాప్‌ సంగతి కూడా తేల్చబోతోంది.
  • దిల్లీతో జరిగిన మ్యాచులో 4 వికెట్లతో అదరగొట్టిన యార్కర్ల స్టార్‌ నటరాజన్‌ (10).. ఈ మ్యాచులోనూ రాణిస్తే పర్పుల్‌ క్యాప్‌ (అత్యధిక వికెట్లు) అందుకుంటాడు. ప్రస్తుతం బుమ్రా (13) దగ్గర ఈ క్యాప్‌ ఉంది. 

తుది జట్లు (అంచనా)

హైదరాబాద్‌: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్‌క్రమ్‌, క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, నితీశ్‌ రెడ్డి, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, పాట్ కమిన్స్ (కెప్టెన్), నటరాజన్‌, జయ్‌దేవ్‌ ఉనద్కత్/షహబాజ్‌ అహ్మద్

బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాప్‌ డుప్లెసిస్‌ (కెప్టెన్), అనుజ్ రావత్, విల్ జాక్స్‌, రజత్ పటీదార్, దినేశ్‌ కార్తిక్ (వికెట్ కీపర్‌), లామ్రోర్‌, విజయ్‌కుమార్ వైశాఖ్, రీస్‌ టోప్లే, లాకీ ఫెర్గూసన్, యశ్‌ దయాల్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు