IND vs ENG: నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌.. 353 పరుగులకు ఇంగ్లాండ్‌ ఆలౌట్‌

టీమ్‌ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 353 పరుగులకు ఆలౌట్‌ అయింది.

Published : 24 Feb 2024 10:51 IST

రాంచీ: టీమ్‌ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 353 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓవర్‌నైట్‌ 302/7తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్‌ను ఆల్‌రౌండర్‌ జడేజా దెబ్బకొట్టాడు. అర్ధశతకం సాధించిన రాబిన్సన్‌(58)ను, ఆ తర్వాత షోయబ్‌ బషీర్‌ను ఒకే ఓవర్‌లో ఔట్ చేశాడు. జేమ్స్‌ అండర్సన్‌ కూడా జడేజా బౌలింగ్‌లోనే ఎల్బీగా వెనుదిరిగాడు. జోరూట్‌ శతకంతో(122) నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్‌దీప్‌ 3, సిరాజ్‌ 2, అశ్విన్ 1 వికెట్ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని