WI vs IND: విండీస్‌తో మ్యాచ్‌లు.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

టీమ్‌ఇండియా ప్రస్తుతం వెస్టిండీస్‌ (West Indies) పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కరేబియన్‌ జట్టుతో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. 

Updated : 11 Jul 2023 14:56 IST

ఇంటర్నెట్ డెస్క్:  డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత దాదాపు నెలరోజులపాటు విశ్రాంతి తీసుకున్న టీమ్‌ఇండియా (Team India) క్రికెటర్లు త్వరలో తిరిగి ప్రొఫెషనల్ క్రికెట్‌ ఆడనున్నారు. ప్రస్తుతం భారత జట్టు వెస్టిండీస్‌ (West Indies)పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కరేబియన్‌ జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. టీ20 సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లు అమెరికాలోని ఫ్లోరిడాలో నిర్వహించనున్నారు. మిగతా అన్ని మ్యాచ్‌లు విండీస్‌లోనే జరగనున్నాయి. టెస్టు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. వన్డేలు రాత్రి 7:00 గంటలకు మొదలుకానున్నాయి. టీ20ల విషయానికొస్తే.. రాత్రి 8 గంటలకు ప్రారంభంకానున్నాయి. టెస్టులు, వన్డేల్లో భారత జట్టుకు రోహిత్‌ శర్మ (Rohit Sharma) నాయకత్వం వహిస్తాడు. టీ20ల్లో సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్య చూసుకుంటాడు. 

ఇక్కడ వీక్షించొచ్చు 

అన్ని మ్యాచ్‌లను దూరదర్శన్ నెట్‌వర్క్‌ అయిన డీడీ స్పోర్ట్స్‌ ఛానల్‌లో మ్యాచ్‌లను ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించొచ్చు. డిజిటల్‌గా అయితే జియో సినిమా, ఫ్యాన్‌కోడ్ (FanCode) యాప్‌లలో చూడొచ్చు.

భారత్, వెస్టిండీస్‌ 100 టెస్టులు 

ఈ రెండు టెస్టుల సిరీస్‌తో ఇరు దేశాల మధ్య టెస్టు మ్యాచ్‌ల సంఖ్య 100కు చేరుతుంది. ఇప్పటివరకు భారత్‌, వెస్టిండీస్‌ 98 టెస్టులు ఆడగా.. 22 మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా, 30 మ్యాచ్‌ల్లో విండీస్‌ గెలుపొందాయి. మిగిలిన 46 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. కరేబియన్‌ జట్టుతో భారత్ ఇప్పటివరకు 139 వన్డేలు ఆడింది. 70 మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా విజయం సాధించగా.. 63 మ్యాచ్‌ల్లో విండీస్‌ నెగ్గింది. రెండు మ్యాచ్‌లు టైగా ముగియగా.. నాలుగింటిలో ఫలితం తేలలేదు.  ఇరుదేశాలు 25 టీ20 మ్యాచ్‌ల్లో తలపడగా.. భారత్‌ ఏకంగా 17 మ్యాచ్‌ల్లో విజయఢంకా మోగించగా.. విండీస్ 7 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

టెస్టులకు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్, రుతురాజ్‌ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానె, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌, శ్రీకర్‌ భరత్, ఇషాన్‌ కిషన్‌, శార్దూల్ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్, జయ్‌దేవ్‌ ఉనద్కత్, నవ్‌దీప్ సైని, ముఖేశ్‌ కుమార్‌.

వన్డేలకు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్, రుతురాజ్‌ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌, సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, శార్దూల్ ఠాకూర్‌, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్‌ యాదవ్‌, జయ్‌దేవ్‌ ఉనద్కత్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, 
మహ్మద్‌ సిరాజ్, ముఖేశ్‌ కుమార్‌.

టీ20లకు భారత జట్టు:

హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్‌, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్‌ యాదవ్‌, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌, అవేశ్‌ ఖాన్‌, ముఖేశ్‌ కుమార్‌.

వెస్టిండీస్‌ జట్టు:

క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), జెర్మైన్‌ బ్లాక్‌వుడ్‌  (వైస్‌ కెప్టెన్‌), అలిక్‌ అథనేజ్‌, త్యాగ్‌నారాయణ్‌ చందర్‌పాల్‌, రఖీమ్‌ కార్న్‌వాల్‌, జోష్వా ద సిల్వా, షనోన్‌ గాబ్రియల్‌, జేసన్‌ హోల్డర్‌, అల్జారి జోసెఫ్‌, కిర్క్‌ మెకంజీ, రేమన్‌ రీఫర్‌, కీమర్‌ రోచ్‌, జోమెల్‌ వారికన్‌ రిజర్వ్‌ ఆటగాళ్లు: టెవిన్‌ ఇమ్లాచ్‌, అకీమ్‌ జోర్డాన్‌.

వెస్టిండీస్‌ తొలి టెస్టుకు మాత్రమే జట్టును ప్రకటించింది. మిగతా మ్యాచ్‌లకు జట్లను ప్రకటించాల్సి ఉంది. 

టెస్టు సిరీస్‌

  • జులై 12-16 తొలి టెస్టు (డొమినికా) 
  • జులై 20-24 రెండో టెస్టు (ట్రినిడాడ్) 

వన్డే సిరీస్‌ 

  • జులై 27 మొదటి వన్డే (బార్బడోస్‌)  
  • జులై 29 రెండో వన్డే (బార్బడోస్‌)  
  • ఆగస్టు 01 మూడో వన్డే (ట్రినిడాడ్) 

టీ20 సిరీస్

  • ఆగస్టు 03 తొలి టీ20 (ట్రినిడాడ్)  
  • ఆగస్టు 06 రెండో టీ20 (గయానా)
  • ఆగస్టు 08 మూడో టీ20 (గయానా)
  • ఆగస్టు 12 నాలుగో టీ20 (ఫ్లోరిడా)
  • ఆగస్టు 13 ఐదో టీ20 (ఫ్లోరిడా)
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని