U19 Asia Cup: అండర్ 19 ఆసియా కప్‌.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

యూఏఈలో (UAE)లో జరగనున్న U19 ఆసియా కప్ (U19 Asia Cup ) 2023 కోసం బీసీసీఐ భారత జట్టుని ప్రకటించింది.

Updated : 25 Nov 2023 19:04 IST

ఇంటర్నెట్ డెస్క్: యూఏఈలో (UAE)లో జరగనున్న U19 ఆసియా కప్ (U19 Asia Cup) 2023 కోసం బీసీసీఐ భారత జట్టుని ప్రకటించింది. 15 మందితో జట్టుని ఎంపిక చేసిన సెలక్టర్లు.. ముగ్గురిని ట్రావెలింగ్ స్టాండ్‌బై తీసుకున్నారు. సెలక్షన్ కమిటీ నలుగురు అదనపు రిజర్వ్ ఆటగాళ్లను కూడా ఎంపిక చేసింది. అయితే, అదనపు రిజర్వ్ ఆటగాళ్లు భారత బృందంతోపాటు యూఏఈకి వెళ్లరు. పంజాబ్‌ క్రికెట్ అసోసియేషన్‌ ఆటగాడు ఉదయ్ సహారన్‌ని కెప్టెన్‌గా, సౌమీ కుమార్ పాండే (మధ్యప్రదేశ్‌)ని వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్‌ ఆటగాళ్లు ఆరవెల్లి అవనీష్ రావు, మురుగన్ అభిషేక్‌లకు జట్టులో చోటు దక్కింది. ఈ టోర్నీ డిసెంబరు 8న ప్రారంభమై.. అదే నెల 17న ఫైనల్‌ మ్యాచ్‌తో ముగుస్తుంది. ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. భారత్, పాకిస్థాన్‌, శ్రీలంక, అఫ్గానిస్థాన్‌, నేపాల్, బంగ్లాదేశ్, యూఏఈ, జపాన్‌ ఈ టోర్నీలో పోటీపడనున్నాయి. 

అండర్‌ 19 ఆసియా కప్‌ భారత జట్టు:

అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్ (కెప్టెన్), ఆరవెల్లి అవనీష్ రావు (వికెట్ కీపర్‌), సౌమీ కుమార్ పాండే (వైస్‌ కెప్టెన్), మురుగన్ అభిషేక్, ఇన్నేష్ మహాజన్ (వికెట్‌ కీపర్‌), ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారీ. 

ట్రావెలింగ్ రిజర్వ్‌ ఆటగాళ్లు

ప్రేమ్‌ దేవ్‌కర్, అన్ష్‌ గోసాయ్‌, ఎండీ. అమన్

రిజర్వ్‌ ప్లేయర్లు

దిగ్విజయ్ పాటిల్, జయంత్ గోయత్, పి విఘ్నేష్, కిరణ్ చోర్మలే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని