World Para Athletics: సిమ్రన్‌ పరుగు బంగారం

సిమ్రన్‌ పరుగు బంగారం  సెవెరినో (25.08 సె, డొమినికా), గోమ్స్‌ ఆగర్‌ (25.40 సె, బ్రెజిల్‌) వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు. టీ12 విభాగంలో కనుదృష్టి లోపం ఉన్నవాళ్లు పోటీపడతారు.

Published : 26 May 2024 03:01 IST

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ 

కోబె (జపాన్‌): సిమ్రన్‌ పరుగు బంగారం  సెవెరినో (25.08 సె, డొమినికా), గోమ్స్‌ ఆగర్‌ (25.40 సె, బ్రెజిల్‌) వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు. టీ12 విభాగంలో కనుదృష్టి లోపం ఉన్నవాళ్లు పోటీపడతారు. దిల్లీకి చెందిన 24 ఏళ్ల సిమ్రన్‌.. హాంగ్జౌ పారా ఆసియాక్రీడల్లో 100, 200 మీటర్లలో రజతాలు నెగ్గింది. మరోవైపు ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో ప్రీతిపాల్‌ (మహిళల టీ35, 100 మీ), నవ్‌దీప్‌ సింగ్‌ (జావెలిన్‌త్రో, ఎఫ్‌-41) కాంస్య పతకాలు గెలిచారు. శుక్రవారం పురుషుల ఎఫ్‌-46 జావెలిన్‌త్రోలో మూడు, నాలుగో స్థానాల్లో నిలిచిన రింకు హుడా, అజీత్‌సింగ్‌లకు రజత, కాంస్య పతకాలు దక్కాయి. మొదట రెండో స్థానం సాధించిన హెరాత్‌ (శ్రీలంక)కు ఈ విభాగంలో పోటీ చేసే అర్హత లేదని భారత అథ్లెట్లు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అతడి ఫలితాన్ని నిలిపివేసిన నిర్వాహకులు.. విచారణ జరిపి హెరాత్‌పై అనర్హత వేటు వేశారు. దీంతో ఇంతకుముందు కంచు నెగ్గిన రింకుకు రజతం.. నాలుగో స్థానంలో నిలిచిన అజీత్‌కు కాంస్యం దక్కాయి. భారత్‌ 17 పతకాలతో (6 స్వర్ణ, 5 రజత, 6 కాంస్యాలు) ఆరో స్థానంతో పోటీలను ముగించింది. చైనా 87 (33 స్వర్ణ, 33 రజత, 24 కాంస్యాలు) అగ్రస్థానాన్ని సాధించింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో సిమ్రన్‌తో పాటు దీప్తి జీవాంజి (మహిళల టీ20, 400 మీ), సచిన్‌ (పురుషుల ఎఫ్‌46, షాట్‌పుట్‌), సుమిత్‌ (పురుషుల ఎఫ్‌-64, జావెలిన్‌), తంగవేలు మరియప్పన్‌ (పురుషుల టీ63, హైజంప్‌), ఏక్తా (మహిళల ఎఫ్‌-51, క్లబ్‌త్రో) స్వర్ణాలు నెగ్గారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని