IPL 2023- Playoffs: ఈ నాలుగు జట్లు ప్లే ఆఫ్స్‌కు ఎలా చేరాయంటే?

ఐపీఎల్-16లో రేపటి నుంచి ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ (Playoffs) చేరిన నాలుగు జట్లు ఏ జట్టుపై విజయం సాధించాయి, ఏ టీమ్‌పై ఓడిపోయాయో తెలుసుకుందాం.

Updated : 22 May 2023 19:59 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-16 సీజన్‌లో లీగ్ దశ ముగిసింది. ఈ సారి ఎన్నాడూ లేనంతగా హోరాహోరీ మ్యాచ్‌లు జరిగాయి. చాలా మ్యాచ్‌ల్లో ఆఖరి ఓవర్లో చివరి బంతి వరకు ఫలితం తేలలేదు. అంతేకాదు లీగ్ దశలో ఆఖరి మ్యాచ్‌ వరకు చివరి ప్లేఆఫ్స్‌ బెర్తు తేలలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై గుజరాత్ టైటాన్స్‌ (Gujarat Titans) విజయం సాధించడంతో ఆఖరి బెర్తును ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్లేఆఫ్స్‌కు చేరుకున్న జట్లు ఏ టీమ్‌పై గెలిచాయి, ఏ టీమ్‌తో ఓటమిపాలయ్యాయి అనే దానిపై ఓ లుక్కేద్దాం. 

గుజరాత్‌ టైటాన్స్ (GT)

డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ వరుసగా రెండో ఏడాది ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి పాయింట్ల పట్టికలో 10 విజయాలు, 4 ఓటములతో అగ్రస్థానంలో నిలిచి అన్ని జట్ల కంటే ముందుగా ప్లేఆఫ్స్‌ బెర్తుని ఖాయం చేసుకుంది. 

విజయాలు: చెన్నై సూపర్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ (రెండుసార్లు),  ముంబయి ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు.

ఓటములు: కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌, ముంబయి ఇండియన్స్‌ 


చెన్నై సూపర్‌ కింగ్స్ (CSK)

గతేడాది పేలవ ప్రదర్శన కనబర్చిన చెన్నై సూపర్‌ కింగ్స్ ఈ సీజన్‌లో చెలరేగుతోంది. 14 మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలు, 5 పరాజయాలు, ఒక మ్యాచ్‌ రద్దుతో కలిపి 17 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

విజయాలు: లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌, ముంబయి ఇండియన్స్‌ (రెండు సార్లు), రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ (రెండు సార్లు). లఖ్‌నవూతో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్. 

ఓటములు: గుజరాత్ టైటాన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ (రెండుసార్లు), పంజాబ్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌. 


లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (LSG)

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ కూడా వరుసగా రెండో ఏడాది ప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలు, 5 ఓటములు, ఒక మ్యాచ్‌ రద్దుతో కలిపి 17 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. సీఎస్కేకు కూడా 17 పాయింట్లే ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేట్ ఉండటంతో ఆ జట్టు రెండో స్థానంలో నిలిచింది. 

విజయాలు: దిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (రెండు సార్లు), రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్‌, పంజాబ్ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌. చెన్నైతో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్. 

ఓటములు: చెన్నై సూపర్‌ కింగ్స్‌,  పంజాబ్‌ కింగ్స్‌, గుజరాత్ టైటాన్స్‌ (రెండుసార్లు), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు.


ముంబయి ఇండియన్స్‌ (MI) 

ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు (5) విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్‌ ఈ సీజన్‌లో చివరి ప్లేఆఫ్స్‌ బెర్తుని దక్కించుకుంది. ఆఖరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై నెగ్గడంతోపాటు గుజరాత్‌పై ఆర్సీబీ ఓడిపోవడంతో ముంబయి ముందంజ వేసింది. ఆ జట్టు ఖాతాలో 8 విజయాలు, 6 ఓటములున్నాయి.

విజయాలు: దిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (రెండుసార్లు), రాజస్థాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌.

ఓటములు: రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌ (రెండు సార్లు), పంజాబ్‌ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని