PBKS vs KKR: మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. కోల్‌కతాపై పంజాబ్‌ విజయం..

ఐపీఎల్‌-16 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ శుభారంభం చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ డక్‌వర్త్ లూయిస్‌ ప్రకారం 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Updated : 02 Apr 2023 00:16 IST

మొహాలి: ఐపీఎల్‌-16 (IPL)  సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ శుభారంభం చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ డక్‌వర్త్ లూయిస్‌ ప్రకారం 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతా తడబడింది. 16 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 146 పరుగులు చేసింది. తర్వాత భారీ వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. తిరిగి మ్యాచ్‌ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం పంజాబ్‌ను విజేతగా ప్రకటించారు. 

192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే భారీ షాక్‌ తగిలింది. అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో మన్‌దీప్‌ సింగ్ (2), అనుకుల్‌ రాయ్‌ (4) ఔటయ్యారు. నిలకడగా ఆడుతున్న రెహ్మనుల్లా (22)ను నాథన్‌ ఎల్లిస్‌ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆండ్రూ రస్సెల్ (35; 19 బంతుల్లో) వెంకటేశ్ అయ్యర్‌ (34), నితీశ్ రాణా (24) పరుగులు చేశారు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్ మూడు, సామ్‌ కరన్‌, నాథన్‌ ఎల్లిస్‌, సికిందర్‌ రజా, రాహుల్ చాహర్‌ తలో వికెట్ పడగొట్టారు. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌..  భానుక రాజపక్స (50; 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), శిఖర్‌ ధావన్‌ (40; 29 బంతుల్లో 6 ఫోర్లు) రాణించడంతో భారీ స్కోరు సాధించింది. జితేశ్ శర్మ (21), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (23) ఫర్వాలేదనిపించారు. చివర్లో సామ్‌ కరన్‌ (26*; 17 బంతుల్లో) ధాటిగా ఆడాడు. షారూక్‌ ఖాన్‌ (11*) పరుగులు చేశాడు. కోల్‌కతా బౌలర్లలో టిమ్‌ సౌథీ రెండు వికెట్లు పడగొట్టగా.. ఉమేశ్ యాదవ్‌, వరుణ్ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌ తలో వికెట్ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని