IPL: ఐపీఎల్‌ 2024 సీజన్‌. కోహ్లీ కొత్త హెయిర్‌స్టైల్‌ అదుర్స్‌.. ఫొటోలు వైరల్

 ఐపీఎల్‌ 2024 సీజన్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) కొత్త హెయిర్‌ స్టైల్‌తో బరిలోకి దిగుతున్నాడు.  

Updated : 19 Mar 2024 16:57 IST

ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ (Virat Kohli) ఐపీఎల్‌ (IPL) 2024 సీజన్‌కు సన్నాహాలు మొదలుపెట్టాడు. భార్య అనుష్క శర్మ ప్రసవం కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లిన విరాట్ ఆదివారం స్వదేశానికి తిరిగొచ్చాడు. కోహ్లీ  సోమవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్టుతో కలిశాడు. ప్రాక్టీస్‌ సెషన్‌లోను పాల్గొన్నాడు. ఎప్పటికప్పుడు హెయిర్‌ స్టైల్‌ మారుస్తూ ట్రెండ్‌ సెట్టర్‌గా మారిన కోహ్లీ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో కొత్త లుక్‌లో బరిలోకి దిగనున్నాడు. ప్రముఖ సెలబ్రెటీ హెయిర్‌ స్టైలిస్ట్ ఆలిమ్‌ హకీమ్‌ కోహ్లీకి కొత్త హెయిర్‌ స్టైల్‌ చేశాడు. కోహ్లీ కొత్త స్టైల్‌ చాలా ట్రెండీగా ఉంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆలిమ్‌ హకీమ్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా అవి వైరల్‌గా మారాయి. మార్చి 22న చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఐపీఎల్‌ ఆరంభ పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఆర్సీబీ తలపడనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని