IPL 2024: రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్‌.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే

దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్‌.. రికార్డులను ఖాతాలో వేసుకుంటోంది.

Published : 28 Mar 2024 15:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ 17వ సీజన్‌ రవసత్తరంగా సాగుతోంది. భారీ స్కోరు నమోదైనా విజయం మాత్రం చివరి బంతి వరకూ దక్కుతుందో, లేదో తెలియని పరిస్థితి. అయితే, ఐపీఎల్‌ ప్రారంభ రోజును (మార్చి 22న) అభిమానులు భారీ సంఖ్యలో వీక్షించారు. దానికి ఈ గణాంకాలే నిదర్శనం. ఐపీఎల్‌ అధికారిక బ్రాడ్‌కాస్టర్ డిస్నీ హాట్‌స్టార్‌, జియో సినిమా ప్లాట్‌ఫామ్స్‌లో వీక్షించే అవకాశం ఉంది. బాలీవుడ్, హాలీవుడ్‌ స్టార్లు మొదటిరోజు ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అలాగే తొలి మ్యాచ్‌ చెన్నై, బెంగళూరుల మధ్య జరిగింది. ఇందులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై జట్టు విజయం సాధించింది. ఈ క్రమంలో 16.8 కోట్ల వ్యూవర్‌షిప్‌ నమోదైనట్లు డిస్నీ స్టార్‌ వెల్లడించింది. తొలిరోజు చూసిన సమయం కూడా భారీగా ఉన్నట్లు పేర్కొంది. 

‘‘ఈ సీజన్‌ మొదటిరోజు 16.8 కోట్ల వ్యూస్‌ వచ్చాయి. అలాగే వాచ్‌టైమ్‌ కూడా 1,276 కోట్ల నిమిషాలుగా నమోదైంది. ఇప్పటివరకు ఇదే అత్యుత్తమం. డిస్నీ హాట్‌స్టార్‌ నెట్‌వర్క్‌లో 6.1 కోట్ల వ్యూవర్లు వీక్షించారు. గత సీజన్‌ తొలిరోజు 870 కోట్ల నిమిషాలు నమోదయ్యాయి. టీవీ వీక్షణల్లోనూ 16 శాతం పెరుగుదల నమోదైంది’’ అని డిస్నీ తెలిపింది. ఇక డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో జియో సినిమాలోనూ 11.3 కోట్ల వ్యూవర్లు తొలి రోజు వీక్షించారు. గతేడాదితో పోలిస్తే ఇది 51 శాతం అధికమని జియో వెల్లడించింది. అలాగే మొత్తం 660 కోట్ల నిమిషాల వాచ్‌టైమ్‌ నమోదైనట్లు కూడా పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని